‘మేం చట్టానికి బధ్ధులం..ఏదీ దాచబోం’.. సోనియా, రాహుల్ గాంధీలకు సమన్లపై ఈడీకి కాంగ్రెస్ ‘రిప్లయ్’

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, సోనియా గాంధీ, పార్టీ నేత రాహుల్ గాంధీలకు ఈడీ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో కోవిడ్ పాజిటివ్ బారిన పడిన సోనియా .. ఈ నెల 8 న ఈ సంస్థ ఎదుట హాజరు కావలసి ఉంది. అయితే ఆమె ఇంకా కోవిడ్ నుంచి కోలుకోకపోగా నెగెటివ్ రిపోర్టు కూడా అందాల్సి ఉంది. ఈ కారణంగా తనకు మరికొంత వ్యవధినివ్వాలని సోనియా.. కోరారు. నేషనల్ హెరాల్డ్ కేసుతో బాటు […]

Advertisement
Update:2022-06-08 12:59 IST

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, సోనియా గాంధీ, పార్టీ నేత రాహుల్ గాంధీలకు ఈడీ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో కోవిడ్ పాజిటివ్ బారిన పడిన సోనియా .. ఈ నెల 8 న ఈ సంస్థ ఎదుట హాజరు కావలసి ఉంది. అయితే ఆమె ఇంకా కోవిడ్ నుంచి కోలుకోకపోగా నెగెటివ్ రిపోర్టు కూడా అందాల్సి ఉంది.

ఈ కారణంగా తనకు మరికొంత వ్యవధినివ్వాలని సోనియా.. కోరారు. నేషనల్ హెరాల్డ్ కేసుతో బాటు ఇందులో మనీ లాండరింగ్ కూడా కేసుకూడా ఇమిడి ఉన్నందున ఈ వ్యవహారం పతాక శీర్షికలకెక్కింది. ఈడీ జారీచేసిన సమన్లగురించి పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా బుధవారం మీడియాతో మాట్లాడుతూ .. తాము చట్టాన్ని గౌరవిస్తామని, రూల్స్ ని పాటిస్తామని చెప్పారు.

ఈ కేసుల విషయంలో తామేదీ దాచే ప్రసక్తి లేదని, ఆ అవసరం కూడా లేదని ఆయన అన్నారు. ‘వాళ్ళ (బీజేపీ) మాదిరి మేం కాదు.. 2002 నుంచి 2013 వరకు అమిత్ షా ఎలా తిరిగారో గుర్తు తెచ్చుకోండి’ అన్నారాయన. వాస్తవ పథానికి, నిజాలకు కొందరు ఎలా కట్టుబడి ఉంటారో మా నుంచి వారుకొన్ని గుణపాఠాలు నేర్చుకుంటారని ఆశిస్తున్నామన్నారు. ఈడీ ఈ విషయాలు తెలుసుకుంటుందని భావిస్తున్నామన్నారు.

ఈ కేసులో ఈ నెల 13 న రాహుల్ ఈడీ అధికారుల ఎదుట హాజరు కావలసి ఉంది. నిజానికి ఈ నెల 2 న ఆయన హాజరు కావలసి ఉండగా విదేశాల్లో ఉన్న కారణంగా తనకు మరికొంత వ్యవధినివ్వాలని కోరారు. రాహుల్ హాజరయ్యే సోమవారం (13న) ఢిల్లీలో భారీ ఈవెంట్ ని పార్టీ నిర్వహించే అవకాశాలున్నాయని అంటున్నారు.

సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ సమన్లు జారీ చేయడాన్ని బీజేపీ ప్రభుత్వ ఎత్తుగడగా, రాజకీయ దురుద్దేశపూరిత చర్యగా పార్టీ మరో అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి ఆరోపించారు. దేశం ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, సామాజిక అసమానతల వంటి వివిధ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న నిర్వాకమే ఇదని ఆయన దుయ్యబట్టారు.

నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను నిర్వహిస్తున్న యంగ్ ఇండియా, ప్రచురిస్తున్న అసోసియేటెడ్ జర్నల్స్ కి సంబంధించి ఇది అసలు ఫేక్ ఇష్యు అని ఆయన పేర్కొన్నారు.

ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ లోని క్రిమినల్ సెక్షన్ల కింద సోనియా, రాహుల్ గాంధీల నుంచి వాంగ్మూలాలను సేకరించాలని ఈడీ భావిస్తోంది. నిజానికి ఈ కేసుకు సంబంధించి ఆధారాలే లేవని సీబీఐ 2015 లోనే ఈ కేసును మూసివేసిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఇటీవల స్పష్టం చేశారు.

కానీ ప్రభుత్వం కావాలనే దీన్ని తిరగదోడుతోందన్నారు. ఏమైనా… నిర్భయంగా నిజాలు చెబుతామని, ఈ విధమైన కేసులకు బెదిరేది లేదని ఆయన వ్యాఖ్యానించారు. సోనియా, రాహుల్ గాంధీతో బాటు సీనియర్ నేతలు మల్లిఖార్జున్ ఖర్గే, మోతీలాల్ వోరాలను ఈడీ ఇదివరకే ప్రశ్నించింది.

యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అసోసియేటెడ్ జర్నల్స్ సంస్థను స్వాధీనం చేసుకుందని ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయలు యంగ్ ఇండియన్ సంస్థకు ట్రాన్స్ ఫర్ అయ్యాయని, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి 2012 లోనే ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో సోనియా, రాహుల్ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. వీరు మోసానికి, విశ్వాసోల్లంఘనకు పాల్పడ్డారని ఆయన అన్నారు.

Tags:    
Advertisement

Similar News