కోర్టు తీర్పుని పట్టించుకోని విద్యార్థినులు.. హిజాబ్ ఇరకాటంలో విద్యాసంస్థలు..

విద్యాసంస్థల్లో మతపరమైన దుస్తులు వద్దు, సంబంధిత డ్రెస్ కోడ్ తోనే క్లాసులకు రావాలని కర్నాటక హైకోర్టు స్పష్టంగా చెప్పినా విద్యార్థినులు హిజాబ్ కోసం ఆందోళనలు చేపడుతున్నారు. తాజాగా 23మంది విద్యార్థినులు ఇలా నిరసన ప్రదర్శన చేపట్టడంతో యాజమాన్యం వారిని సస్పెండ్ చేసింది. హిజాబ్ ధరించి వచ్చేందుకు తమకు ప్రత్యేక అనుమతివ్వాలంటూ వారు డిమాండ్ చేశారు. దక్షిణ కన్నడ జిల్లాలోని ఉప్పినగండి ప్రభుత్వ కాలేజీ విద్యార్థినులు ఈ నిరసన ప్రదర్శన చేపట్టారు. దీంతో కాలేజీ ప్రిన్సిపల్ వారిని వారం […]

Advertisement
Update:2022-06-07 12:41 IST

విద్యాసంస్థల్లో మతపరమైన దుస్తులు వద్దు, సంబంధిత డ్రెస్ కోడ్ తోనే క్లాసులకు రావాలని కర్నాటక హైకోర్టు స్పష్టంగా చెప్పినా విద్యార్థినులు హిజాబ్ కోసం ఆందోళనలు చేపడుతున్నారు. తాజాగా 23మంది విద్యార్థినులు ఇలా నిరసన ప్రదర్శన చేపట్టడంతో యాజమాన్యం వారిని సస్పెండ్ చేసింది. హిజాబ్ ధరించి వచ్చేందుకు తమకు ప్రత్యేక అనుమతివ్వాలంటూ వారు డిమాండ్ చేశారు. దక్షిణ కన్నడ జిల్లాలోని ఉప్పినగండి ప్రభుత్వ కాలేజీ విద్యార్థినులు ఈ నిరసన ప్రదర్శన చేపట్టారు. దీంతో కాలేజీ ప్రిన్సిపల్ వారిని వారం రోజులపాటు తరగతులకు రాకుండా సస్పెండ్ చేశారు.

కొనసాగుతున్న వివాదం..

హిజాబ్ విషయంలో కర్నాటక హైకోర్టు విస్పష్టమైన తీర్పునిచ్చింది. దీనిపై విద్యార్థినులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అయితే ఈ విచారణలో తమపై ఒత్తిడి తేవాలని చూడొద్దని ఇప్పటికే ఓసారి సుప్రీం స్పష్టం చేసింది. కేసు విచారణలో ఉండగానే పరీక్షలు, వేసవి సెలవలు రావడంతో ఈ వివాదం కాస్త సద్దుమణిగింది. అయితే కొన్నిచోట్ల హిజాబ్ ధరించి కాలేజీలకు వస్తున్నా యాజమాన్యాలు పెద్దగా అభ్యంతరపెట్టడంలేదు. మంగుళూరులోని యూనివర్శిటీ కాలేజీలో హిజాబ్ తోనే విద్యార్థినులు లోపలికి రావడంతో ఏబీవీపీ నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో చివరకు యూనివర్శిటీ అధికారులు హిజాబ్ లేకుండా రావాలని విద్యార్థినులకు సూచించారు. హిజాబ్ లేకపోతే తల్లిదండ్రులు తమని బయటకు పంపించరని, తాము కాలేజీ విద్యకు దూరమవుతున్నామంటూ కొంతమంది ఆవేదన వ్యక్తం చేశారు కూడా. ఈ క్రమంలో తాజాగా దక్షిణ కన్నడ జిల్లాలో వివాదం మొదలైంది.

హిజాబ్ తో తమను తరగతులకు అనుమతించాలంటూ విద్యార్థినులు పట్టుబట్టడం, ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతో అధికారులకు ఏం చేయాలో అర్థం కావడంలేదు. ఓవైపు కోర్టు తీర్పు స్పష్టంగా ఉన్నా కూడా అనుమతి కోసం విద్యార్థినులు ఆందోళనబాట పడుతున్నారు. ఆందోళన చేపట్టిన విద్యార్థినులను కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేయడంతో ఈ వివాదం మరో కొత్త మలుపు తిరిగినట్టయింది.

Also Read : క్యాన్స‌ర్‌కి మందు వ‌చ్చేసింది.

Tags:    
Advertisement

Similar News