బాబు బైబిల్ సూక్తి పాటిస్తే పొత్తులకు సై

పొత్తులపై పవన్‌ కల్యాణ్ మరింత స్పష్టత ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన సూచనలు చేశారు. ప్రస్తుతం జనసేన ముందు మూడు మార్గాలున్నాయని.. 1- బీజేపీ- జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, 2- జనసేన-బీజేపీ- టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం, 3- జనసేన ఒక్కటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. ఈ మూడింటిలో దేనికైనా జనసేన సిద్ధంగానే ఉందని.. పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అన్న మాటను తాము నమ్ముతానన్నారు. ఈ సందర్బంగా తాను […]

Advertisement
Update:2022-06-04 14:57 IST

పొత్తులపై పవన్‌ కల్యాణ్ మరింత స్పష్టత ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన సూచనలు చేశారు. ప్రస్తుతం జనసేన ముందు మూడు మార్గాలున్నాయని.. 1- బీజేపీ- జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, 2- జనసేన-బీజేపీ- టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం, 3- జనసేన ఒక్కటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. ఈ మూడింటిలో దేనికైనా జనసేన సిద్ధంగానే ఉందని.. పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అన్న మాటను తాము నమ్ముతానన్నారు.

ఈ సందర్బంగా తాను టీడీపీకి ఒకటే చెబుతున్నానంటూ.. టీడీపీ కూడా బైబిల్ సూక్తిని పాటించాలన్నారు. తనకు తాను తగ్గించుకున్న వాడు .. హెచ్చింపబడుతాడన్న బైబిల్ సూక్తిని టీడీపీ పాటించాలన్నారు. పరోక్షంగా పొత్తులకు సిద్ధమే, కాకపోతే టీడీపీ కూడా ఈసారి కాస్త తగ్గాలి అన్న సంకేతాలిచ్చారు పవన్. తగ్గాల్సినంత కాలం రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన తగ్గిందని.. ఇప్పుడు ఇతరులు కూడా తగ్గాలంటూ పరోక్షంగా టీడీపీ గురించి మాట్లాడారు.

బీజేపీతో తనకు సంబంధాలు చాలా బాగున్నాయని కూడా చెప్పారు. కరోనా వల్ల సామాజిక దూరం పాటించాల్సి వచ్చిందని అందుకే బీజేపీతో కలిసి కార్యక్రమాలు చేయలేకపోయానని చెప్పారు. ఇప్పుడు కరోనా తగ్గింది కాబట్టి ఆ దూరం కూడా తగ్గుతుందన్నారు. చంద్రబాబు గతంలో వన్‌సైడ్ లవ్ అన్నారని.. ఇప్పుడు వార్‌ వన్‌ సైడ్‌ అంటున్నారని.. చంద్రబాబుకు ఈ విషయంలో ఒక స్పష్టత వచ్చిన తర్వాత మాట్లాడుదామన్నారు. ( జనసేన పొత్తుపై శ్రేణుల నుంచి డిమాండ్ రాగా.. కొద్దిరోజుల క్రితం స్పందించిన చంద్రబాబు వన్‌సైడ్‌ లవ్ కాదు.. ప్రేమ రెండు వైపులా ఉండాలంటూ మాట్లాడారు). జనసేన అన్నిసార్లూ తగ్గిందని ఈసారి మిగతా వారు తగ్గితే బాగుంటుంది అన్నది జనసేన అభిప్రాయమని పవన్ వ్యాఖ్యానించారు. మొత్తం మీద ఈసారి టీడీపీ తగ్గాలంటూ పరోక్షంగా పవన్ చేసిన వ్యాఖ్యలను బట్టి.. ఈసారి ఎన్నికల్లో సీట్ల విషయంలో జనసేన పట్టుపట్టే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ కూడా ఒంటరిగా పోటీ చేసే మూడ్‌లో లేదు. కాబట్టి ఈసారి జనసేన డిమాండ్లకు టీడీపీ తలొగ్గవచ్చు.

Tags:    
Advertisement

Similar News