గూగుల్ సంస్థ దళిత వ్యతిరేకా ?
భారత్ లోని అగ్రకుల శక్తులు అమెరికాలో కూడా ఎంత బలమైన ప్రభావాన్ని చూపుతాయో తెలిపే వార్త ఇది. దళితుల పట్ల అక్కడ కూడా జరుగుతున్న వివక్షకు తార్కాణం ఈ వార్త. అమెరికాలో ఈక్వాలిటీ ల్యాబ్స్ అనే సంస్థ ఉంది.ఇది లాభాపేక్ష లేకుండా దళితులు, అత్యల్ప శ్రేణి కుల సభ్యుల కోసం పని చేస్తుంది. దీని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తేన్‌మొళి సౌందరరాజన్. వివిధ సంస్థలు కులం పై జరిగే చర్చలకు ఆమెను గెస్ట్ గా ఆహ్వానిస్తాయి. ఆమె గతంలో […]
భారత్ లోని అగ్రకుల శక్తులు అమెరికాలో కూడా ఎంత బలమైన ప్రభావాన్ని చూపుతాయో తెలిపే వార్త ఇది. దళితుల పట్ల అక్కడ కూడా జరుగుతున్న వివక్షకు తార్కాణం ఈ వార్త.
అమెరికాలో ఈక్వాలిటీ ల్యాబ్స్ అనే సంస్థ ఉంది.ఇది లాభాపేక్ష లేకుండా దళితులు, అత్యల్ప శ్రేణి కుల సభ్యుల కోసం పని చేస్తుంది. దీని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తేన్‌మొళి సౌందరరాజన్. వివిధ సంస్థలు కులం పై జరిగే చర్చలకు ఆమెను గెస్ట్ గా ఆహ్వానిస్తాయి. ఆమె గతంలో మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్, ఎయిర్‌బిఎన్‌బి, నెట్‌ఫ్లిక్స్, అడోబ్‌లలో కులంపై చర్చలు జరిపారు. అదే విధంగా గూగుల్ సంస్థ కూడా ఆమెను పిల్చింది. అప్పుడు మొదలయ్యింది అసలు కథ.
గూగుల్ ఉండే అగ్రకుల భారతీయులు తమ అసలు రూపాలు బహిర్గతం చేశారు. ఆమెను రాకుండా చేయడం కోసం కుట్రలకు పూనుకున్నారు. జూన్ 2 నాటి వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం, గూగుల్ ఉద్యోగుల్లోని కొన్ని సమూహాలు కంపెనీ ఉన్నతాధికారులకు సామూహిక ఈమెయిల్‌లు పంపారు, తేన్‌మోళిపై హిందూ ఫోబిక్, హిందూ వ్యతిరేకి అని ఆరోపణలు చేశారు.
తేన్‌మొళి ఉపన్యాసం వల్ల తమ ప్రాణాలకు ప్రమాదం ఉంది అని ఉద్యోగులు పేర్కొన్నారు. పైగా ఆ అగ్రకుల గుంపు, యునైటెడ్ స్టేట్స్‌లో కులం లేదని, కుల వివక్ష లేదని తమ ఈ మెయిల్స్ లో చెప్పారు. భారతదేశంలో రిజర్వేషన్ వ్యవస్థ కారణంగానే కులం ఉందని, ఆ రిజర్వేషన్ అనేది అగ్ర కులాలపై వ్యతిరేక వివక్ష అని పేర్కొన్నారు.
ఇక అగ్రకుల ఉద్యోగుల ఈ మెయిళ్ళను, ప్రచారాన్ని చూసి గూగుల్ యాజమాన్యం ఆ చర్చా కార్యక్రమాన్ని రద్దు చేసింది. అంతటితో ఆగకుండా సౌందరరాజన్ ను ఆహ్వానించిన గూగుల్ న్యూస్‌లో సీనియర్ మేనేజర్ తనూజా గుప్తాపై కక్ష సాధింపు చర్యలను ప్రారంభించింది. దాంతో తనూజా గుప్తా ఆ సంస్థకు రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఈ ఘటనపై దళిత, పౌరహక్కుల సంస్థ ఈక్వాలిటీ ల్యాబ్స్ తీవ్రంగా స్పంధించింది. గూగుల్ సంస్థ కుల తత్వం కలిగి ఉందని ఆరోపించింది. ”కంపెనీలో కుల దురభిమానాన్ని, వేధింపులను ప్రోత్సహిస్తున్న గూగుల్ యాజమాన్యం ఆ కంపెనీ ఉద్యోగులను ప్రమాదంలో పడేసింది” అని ఆరోపించింది.
” సౌందరరాజన్, ఈక్వాలిటీ ల్యాబ్స్ గురించి కుల సమానత్వానికి వ్యతిరేకులు అంతర్గతంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి పౌర హక్కుల ఈవెంట్‌ను అంతిమంగా రద్దు చేయడంలో విజయం సాధించారు” అని ఈక్వాలిటీ ల్యాబ్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఆసంస్థకు రాజీనామా చేసిన తనూజా గుప్తా తన రాజీనామా లేఖలో… “11 సంవత్సరాలుగా ఈ కంపెనీలో పని చేస్తున్నాను. నా ఉద్యోగం చేస్తూ, కంపెనీలో కుల సమానత్వాన్ని ప్రోత్సహిస్తున్న క్రమంలో,కులం కారణంగా నలుగురు మహిళలను వేధించడం, వారి గొంతు నొక్కడం నేను చూశాను. ,” అని అన్నారు.