పేదరికం పేగుబందాల్ని తెంచేసింది

ఆకలి… పేదరికం…. పేగు బందాల్ని కూడా తెంచేశాయి… ఆకలితో పిల్లలు గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటే ఏమీ చేయలేని నిస్సహాయత ఓ తల్లిని దారుణానికి ఒడిగట్టేలా చేశాయి. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా భోకర్ లోని పాండుర్నా గ్రామానికి చెందిన దుర్పదాబాయి, నిమల్ వాడ్ దంపతులకు రెండేళ్ల కుమారుడు దత్తా, నాలుగు నెలల చిన్నారి అనసూయ ఉన్నారు. పేదరికంతో కొట్టు మిట్టాడుతున్న ఆ కుటుంబానికి పిల్లల కడుపు నింపడం కూడా అసాధ్యంగా మారింది. అయితే మే 31న కూతురు […]

Advertisement
Update:2022-06-04 05:15 IST

ఆకలి… పేదరికం…. పేగు బందాల్ని కూడా తెంచేశాయి… ఆకలితో పిల్లలు గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటే ఏమీ చేయలేని నిస్సహాయత ఓ తల్లిని దారుణానికి ఒడిగట్టేలా చేశాయి.

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా భోకర్ లోని పాండుర్నా గ్రామానికి చెందిన దుర్పదాబాయి, నిమల్ వాడ్ దంపతులకు రెండేళ్ల కుమారుడు దత్తా, నాలుగు నెలల చిన్నారి అనసూయ ఉన్నారు. పేదరికంతో కొట్టు మిట్టాడుతున్న ఆ కుటుంబానికి పిల్లల కడుపు నింపడం కూడా అసాధ్యంగా మారింది.

అయితే మే 31న కూతురు అనసూయ ఆకలితో తీవ్రంగా ఏడ్చింది. అప్పటికే ఏం చేయాలో తోచని నిస్సహాయ స్థితిలో ఉన్న దుర్పదబాయి కూతురును గొంతునులుమి చంపేసింది. అనంతరం పొలానికి తీసుకెళ్లి దహనం చేసింది. కాగా ఆ మరుసటి రోజు జూన్ 1న కొడుకు దత్తాను కూడా ఇదే రీతిలో చంపేసింది.

అయితే పిల్లల్ని చంపిన అనంతరం వారిని దహనం చేసేందుకు ముఖేడ్ ప్రాంతంలో ఉంటున్న నిందితురాలి తల్లి కొండాబాయ్.. సోదరుడు మాధవ్ రాజ్ మోద్ ఆమెకు సహకరించినట్టు పోలీసుల విచారణలో తేలింది.ప్రస్తుతం ఈ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

మీడియా, సోషల్ మీడియా ఈ సంఘటన‌పై భగ్గున మండింది. ఆ నిస్సహాయ తల్లికి ప్రేమే లేదని, రాక్షసి అని, తల్లి అనే పదానికే మచ్చ తెచ్చిందని…ఒకటేమిటి అనేక రకాల మాటలతో ఆ తల్లిపై దాడి చేస్తున్నారు. అయితే ఒక్కరు కూడా ఆ తల్లి స్వంత పిల్లలనే చంపుకునే పరిస్థితి దాపురించిన ఆకలిపై…పేదరికంపై…అందుకు కారణమైన వ్యవస్థపై….. కనీస సహాయం చేయని పాలకులపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అంటే ఆ పిల్లల హత్యలను సమర్ధించడమే.

Tags:    
Advertisement

Similar News