ఏబీఎన్‌ పై శ్రీవాణి ఫైర్ – మాది పేటీఎం బ్యాచ్‌ కాదు.. జగన్‌ కోసం ప్రాణమిచ్చే బ్యాచ్‌

మాజీ మంత్రి పుష్పశ్రీవాణి అలక అంటూ ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై ఆమె తీవ్రంగా స్పందించారు. ఇదే చానల్‌ గతంలోనూ తనకు వ్యతిరేకంగా ఇలాంటి కథనాలే రాసిందన్నారు. అప్పుడు తాను పట్టించుకోలేదని.. కానీ ఇప్పుడు ప్రసారం చేసిన కథనంలో జగన్‌ తీసుకున్న నిర్ణయంపై తాను అలిగానని చెప్పారు కాబట్టే స్పందించాల్సి వస్తోందన్నారు. ఎల్లో మీడియా అనుకుంటున్నట్టు తాను పెయిడ్‌ బ్యాచ్‌, పేటీఎం బ్యాచ్‌ కాదని.. జగన్‌ కోసం ప్రాణాలిచ్చే బ్యాచ్‌ అని ఆమె చెప్పారు. జగన్‌ ఏ […]

Advertisement
Update:2022-06-03 02:07 IST

మాజీ మంత్రి పుష్పశ్రీవాణి అలక అంటూ ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై ఆమె తీవ్రంగా స్పందించారు. ఇదే చానల్‌ గతంలోనూ తనకు వ్యతిరేకంగా ఇలాంటి కథనాలే రాసిందన్నారు. అప్పుడు తాను పట్టించుకోలేదని.. కానీ ఇప్పుడు ప్రసారం చేసిన కథనంలో జగన్‌ తీసుకున్న నిర్ణయంపై తాను అలిగానని చెప్పారు కాబట్టే స్పందించాల్సి వస్తోందన్నారు.

ఎల్లో మీడియా అనుకుంటున్నట్టు తాను పెయిడ్‌ బ్యాచ్‌, పేటీఎం బ్యాచ్‌ కాదని.. జగన్‌ కోసం ప్రాణాలిచ్చే బ్యాచ్‌ అని ఆమె చెప్పారు. జగన్‌ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహించే బ్యాచ్‌ తమది అన్నారు. తమ పదవులు పోయిన మరుసటి రోజే కొత్త మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి హాజరైన వ్యక్తులం తామని గుర్తు చేశారు.

కట్టెకాలే వరకు జగన్‌తోనే ఉండే వ్యక్తులం తామన్నారు. ఎల్లో మీడియా మసాలా యాడ్‌ చేసినంత మాత్రాన కురుపాం ప్రజలెవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. పైగా తాను డబ్బులు వెనుకేసుకున్నానని ప్రసారం చేశారని.. ఆ డబ్బులు ఎక్కడున్నాయో చెబితే తెచ్చుకుంటామన్నారు. తమ కుటుంబం డబ్బు కోసం పనిచేసిది కాదన్నారు. తమ కుటుంబానికి 40ఏళ్ల రాజకీయ చరిత్ర ఉందన్నారు.

దోచుకోవడం, దాచుకోవడం అన్నది తన కుటుంబ చరిత్రలోనే లేదన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో జగతి ఎమర్జెన్సీ సర్వీసు తెచ్చానని.. ఇప్పుడు మంత్రి పదవి పోయినా, సిబ్బందిని కొనసాగించడం కష్టంగా ఉన్నా, వ్యక్తిగతంగా తాము ఇబ్బంది పడుతున్నా సర్వీస్‌ను నడుపుతున్నామని చెప్పారు.

తాము ఇబ్బంది పడైనా సరే ఎదుటి వారికి సాయం చేసే గుణం ఉన్న కుటుంబం తమదన్నారు. పుష్ప శ్రీవాణి.. ఉద్యోగాలు అమ్ముకోదు, ఇసుక దందాలు చేయదు, భూములు కబ్జా చేయదు అన్న విషయం ఇక్కడి ప్రజలందరికీ తెలుసన్నారు. తాను మంత్రిగా చేసిన మూడేళ్లలో ఒక్క సారైనా అవినీతి చేసినట్టు టీడీపీ వారు నిరూపిస్తే రాజకీయాల నుంచే తప్పుకుంటానని సవాల్ చేశారు.

తమ మామ చనిపోవడంతో 12 రోజుల కార్యక్రమాల్లో రెస్ట్ లేకుండా పనిచేయడంతో అనారోగ్యానికి గురయ్యానని.. అందుకే బస్సు యాత్రలో తాను పాల్గొనలేకపోయానన్నారు. అయినప్పటికీ గడపగడపకు కార్యక్రమాన్ని నిర్వహించామని వివరించారు. తాను బస్సు యాత్రకు హాజరు కాలేని విషయాన్ని బొత్స సత్యనారాయణకు ముందే చెప్పానని పుష్ప శ్రీవాణి వివరించారు.

ALSO READ : ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ..

Tags:    
Advertisement

Similar News