మైనర్‌పై లైంగిక దాడి.. ఘాతుకానికి పాల్పడిన ఇద్దరు ప్రజాప్రతినిధుల కుమారులు.!
హైదరాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకున్నది. ఓ బాలిక (17)ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్లి లైంగిక దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనపై గురువారం రాత్రి పోలీసులకు సమాచారం అందడంతో దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే.. గత వారం జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో పార్టీ అనంతరం ఒక బాలిక (17) ఇంటికి వెళ్లడానికి ఎదురు చూస్తున్నది. అదే సమయంలో పబ్‌లో పార్టీ ముగించుకున్న కొందరు […]
హైదరాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకున్నది. ఓ బాలిక (17)ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్లి లైంగిక దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనపై గురువారం రాత్రి పోలీసులకు సమాచారం అందడంతో దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే..
గత వారం జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో పార్టీ అనంతరం ఒక బాలిక (17) ఇంటికి వెళ్లడానికి ఎదురు చూస్తున్నది. అదే సమయంలో పబ్‌లో పార్టీ ముగించుకున్న కొందరు యువకులు ఖరీదైన లగ్జరీ కార్‌లో వచ్చారు. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామంటూ తమ కారులో తీసుకొని వెళ్లారు. మార్గమధ్యలో ఆ బాలికపై అత్యాచారం చేశారు. కాగా, ఇంటికి చేరుకున్న టీనేజర్ మెడపై గాయాలు ఉండటంతో తల్లిదండ్రులు నిలదీశారు. ఇద్దరు యువకులు తనతో అసభ్యంగా ప్రవర్తించారని అప్పుడు చెప్పింది. కానీ తర్వాత తనపై అత్యాచారం జరిగిందని చెప్పడంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తన కూతురును కొంత మంది అడ్డగించారని.. ముగ్గురు నుంచి నలుగురు యువకులు లైంగిక దాడి చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఘటన జరిగిన రోజు బాధితురాలు తల్లిదండ్రుల అనుమతితో ఒక అబ్బాయి వెంట పార్టీకి వెళ్లింది. ఆ పార్టీ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగింది. నాన్-ఆల్కాహాలిక్ పార్టీ కావడంతో తల్లిదండ్రులు సమ్మతించారు. పార్టీ అనంతరం ఆమెను కలిసిన కొందరు యువకులు కారులో తీసుకొని వెళ్లినట్లు పోలీసులు చెప్పారు.
తొలుత రెండు కార్లలో కొంత మంది యువకులు, బాధితురాలు కలసి బంజారాహిల్స్‌లోని ఒక బేకరీకి వెళ్లారు. ఆ తర్వాత ఇంటి దగ్గర దింపుతామని చెప్పి.. కారులో తీసుకెళ్లి లైంగిక దాడి చేశారు. కాగా, వారి నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి చేరుకున్నది. బాధితురాలు, తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు. పబ్, బేకరీలోని సీసీటీవీ కెమేరాలు, కార్ల రిజిస్ట్రేషన్ వివరాలను బట్టి కొన్ని వివరాలు రాబట్టారు. సదరు కార్లు ఒక మహిళ పేరు మీద రిజిస్టర్ అయినట్లు గుర్తించారు.
కాగా, నిందితుల్లో ఇద్దరు ప్రజాప్రతినిధుల పిల్లలు ఉన్నట్లు తెలిసింది. ఇందులో ఒకరు ఎమ్మెల్యే బంధువుల కాగా.. మరొకరు చాలా పేరున్న రాజకీయ నాయకుడని తెలుస్తోంది. ఎమ్మెల్యే బంధువు ఎక్కడ ఉన్నాడో కనుక్కోవడానికి ఘటన జరిగిన మే 28 నుంచి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇందులో తమ వాడి ప్రమేయం లేదని ఎమ్మెల్యే చెబుతున్నట్లు తెలుస్తున్నది.
కాగా, ఇప్పటి వరకు నిందితులను అదుపులోనికి తీసుకోలేదని పోలీసులు చెబుతున్నారు. బాధితురాలు షాక్‌లో ఉందని, ఆమె కోలుకుంటే కానీ ఆ యువకులు ఎవరనే విషయంపై స్పష్టత రాదని సీనియర్ పోలీస్ అధికారి చెప్తున్నారు.