ఆత్మకూరు ఉపఎన్నికకు విక్ర‌మ్‌రెడ్డి నామినేషన్.. పోటీ చేయట్లేదని చెప్పిన చంద్రబాబు

ఆత్మకూరు అసెంబ్లీ సెగ్మెంట్ ఉపఎన్నిక కోసం వైఎస్ఆర్ సీపీ తరపున మేకపాటి విక్రమ్ రెడ్డి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడే విక్రమ్. ఆయన నామినేషన్ దాఖలు చేసే ముందు నెల్లూరు బైపాస్ రోడ్డులోని ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నెల్లూరు సెంటర్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు వైసీపీ […]

Advertisement
Update:2022-06-02 12:21 IST

ఆత్మకూరు అసెంబ్లీ సెగ్మెంట్ ఉపఎన్నిక కోసం వైఎస్ఆర్ సీపీ తరపున మేకపాటి విక్రమ్ రెడ్డి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడే విక్రమ్. ఆయన నామినేషన్ దాఖలు చేసే ముందు నెల్లూరు బైపాస్ రోడ్డులోని ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నెల్లూరు సెంటర్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు వైసీపీ నాయకులు కూడా పాల్గొన్నారు. జూన్ 23న ఆత్మకూరులో పోలింగ్ జరుగనుండగా.. 26న ఫలితాలు వెలువడనున్నాయి.

ఆత్మకూరు అసెంబ్లీ సెగ్మెంట్‌కు జరుగుతున్న ఉప ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పదవిలో ఉన్న నేత చనిపోయిన కారణంగా జరుగుతున్న ఉపఎన్నికల్లో సదరు నేత కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనే నిబంధనను టీడీపీ పాటిస్తున్నదని చెప్పారు. ఈ సాంప్రదాయాన్ని మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబానికి కూడా తాము పాటిస్తున్నామని అన్నారు. అయితే, ఉప ఎన్నికలపై వైసీపీ నాయకులు చేస్తున్న సవాళ్లు చాలా నీచంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు ఆత్మకూరులో తాము పోటీకి దిగపోతున్నట్లు బీజేపీ ప్రకటించింది. అక్కడ తమ అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తామని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తమ పొత్తు కేవలం జనసేనతోనే ఉంటుందన్నారు.

Tags:    
Advertisement

Similar News