టీడీపీ లోపలి బాగోతం మొత్తం చెప్పేసిన దివ్యవాణి

టీడీపీకి రాజీనామా చేసిన దివ్యవాణి మీడియా సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ అంతర్గత రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజీ అందింది అందుకే దివ్యవాణి టీడీపీకి రాజీనామా చేయడం లేదంటూ బుద్దిలేని మాటలు మాట్లాడారన్నారు. మరికొందరు మూర్ఖులు మహానాడులో ఎవరెవరికో పేరు వచ్చింది ఈమెకు రాలేదు కాబట్టే రాజీనామా పేరుతో హైప్ కోసం ప్రయత్నిస్తోందని మాట్లాడారన్నారు. దివ్యవాణి అంటే ఒక బాపు బొమ్మ, క్రీస్తు బిడ్డ అన్న సంగతి మరిచిపోయి టీడీపీలోకి వచ్చి ఇక్కడ ఫైర్ బ్రాండ్ […]

Advertisement
Update:2022-06-02 07:47 IST

టీడీపీకి రాజీనామా చేసిన దివ్యవాణి మీడియా సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ అంతర్గత రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజీ అందింది అందుకే దివ్యవాణి టీడీపీకి రాజీనామా చేయడం లేదంటూ బుద్దిలేని మాటలు మాట్లాడారన్నారు. మరికొందరు మూర్ఖులు మహానాడులో ఎవరెవరికో పేరు వచ్చింది ఈమెకు రాలేదు కాబట్టే రాజీనామా పేరుతో హైప్ కోసం ప్రయత్నిస్తోందని మాట్లాడారన్నారు.

దివ్యవాణి అంటే ఒక బాపు బొమ్మ, క్రీస్తు బిడ్డ అన్న సంగతి మరిచిపోయి టీడీపీలోకి వచ్చి ఇక్కడ ఫైర్ బ్రాండ్ అన్న ముద్ర వేయించుకున్నానన్నారు. చంద్రబాబును ఎవరైనా ఏమైనా అంటే దివ్యవాణి ఊరుకోదు అన్న పేరు తనకు టీడీపీలో వచ్చిందన్నారు.

సినీ పరిశ్రమలో రిమార్కు లేకుండా పనిచేశానని.. పెద్దపెద్ద హీరోలతో పనిచేయకపోవడానికి కూడా కారణం తన ఆత్మాభిమానమే అన్నారు. హిందూ కుటుంబంలో పుట్టిన తాను ఆ తర్వాత క్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించి, ప్రభువుకు కట్టుబడి ఉన్నానన్నారు. సువార్త సభలకు వెళ్లినప్పుడు ప్రజల కష్టాలు చూసి , వారికి సేవ చేయాలంటే అధికారం ఉండాలన్న ఆలోచన కలిగిందన్నారు. విజన్ ఉన్న చంద్రబాబు వద్ద పనిచేస్తే ప్రజలకు మంచి చేయగలుగుతానని టీడీపీలో చేరానన్నారు.

గతంలో ఢిల్లీలోని అధికారులతో మాట్లాడేందుకు కూడా దివ్యవాణికి ప్రాముఖ్యత ఇచ్చిన వారు… ఏడాదిగా ఎందుకు ప్రాధాన్యత తగ్గించారో అర్థం కావడం లేదన్నారు. ఏడాది క్రితం రాష్ట్రంలో గుళ్లను ధ్వంసం చేసిన సమయంలో.. ఒక మీటింగ్‌లో చంద్రబాబు కులాలు,మతాల గురించి మాట్లాడుతూ మత మార్పిడిలు ఎలా చేస్తారని మాట్లాడరన్నారు. ఆ సమయంలో తాను నిజాయితీగా కొన్ని మాటలు చెప్పానన్నారు. మైక్‌ తీసుకుని ” అయ్యా నీ భావన కరెక్టే.. నీ భాష్యం తప్పింది. ఒక వ్యక్తి గురించి మొత్తం వ్యవస్థను ఎలా అంటారు” అని ప్రశ్నించానన్నారు. బలవంతపు మత మార్పిళ్లు చేస్తున్నారని అన్నప్పుడు… ఆరు నెలల పసిపిల్లాడికి కూడా బలవంతంగా పాలు తాగించలేం… . అలాంటిది బలవంతంగా మత మార్చిడులు ఎలా సాధ్యమని ప్రశ్నించానన్నారు. ఆ సమావేశంలో ఉన్న నాయకులంతా తర్వాత తనకు ఫోన్ చేసి అద్బుతంగా మాట్లాడారని, చంద్రబాబుకు తాము చెప్పలేని విషయాలను మీరు చెప్పారని అభినందించారన్నారు.

పచ్చడి బాగుందా, కారంగా ఉందా అన్నది తినేవాడు చెప్పలే గానీ… పీకే , పీకే అసిస్టెంట్‌ చెప్పే రిపోర్టును నమ్ముకుంటే సరిపోదని చెప్పానన్నారు. చాలా మంది క్రైస్తవులు బాధపడుతున్నారు.. నిజాలు చంద్రబాబు వద్దకు తీసుకెళ్లండి అని నాయకులను కోరితే తనను తొక్కిపెట్టారు. క్రైస్తవులకు సంబంధించి కొన్ని పాయింట్లను టీడీ జనార్ధన్‌కు వాయిస్‌ రికార్డు ద్వారా పంపించానన్నారు. ఆ పాయింట్లను తాను ప్రెస్‌మీట్‌లో చెబుదామనుకుంటే… తాను పంపిన పాయింట్లతో రెండు రోజుల తర్వాత తెనాలికి చెందిన ఒక క్రైస్తవుడితో ప్రెస్‌మీట్‌ పెట్టించి ఆ పాయింట్లను అతడితో చెప్పించారన్నారు. దాంతో టీడీ జనార్ధన్‌కు ఫోన్ చేసి.. నేనిచ్చిన పాయింట్లతో వేరే వ్యక్తి ప్రెస్‌మీట్ పెట్టడం ఏంటి… మీరు ద్రోహం చేస్తున్నారు ఈ విషయాలను ప్రెస్‌మీట్ పెట్టి బయటకు చెప్పేస్తా అని సూటిగా టీజీ జనార్ధన్‌కు చెప్పానన్నారు. అప్పటి నుంచి తన డౌన్‌పాల్‌ మొదలైందన్నారు.

కొందరు ఇడియట్స్‌ జర్నలిజం ముసుగులో ఉంటూ ప్రెస్‌మీట్‌ ను దివ్యవాణి ప్రార్థన చేసి మొదలుపెట్టిందంటూ మాట్లాడారని ఆమె మండిపడ్డారు. అధికారం లేని అధికార ప్రతినిధి పదవి అంటోంది… అధికార ప్రతినిధి అంటే కత్తిడాలు ఉంటుందా అని ఆ జర్నలిస్ట్‌ ఇడియట్ మాట్లాడారన్నారు.

టీడీపీ 40ఏళ్ల కార్యక్రమంలోనూ తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. చంద్రబాబు వద్దకూ తనను వెళ్లనీయ లేదన్నారు. అధికార ప్రతినిధులుగా వచ్చిన వారికి, మహిళా అధ్యక్షరాలి పదవులతో పాటు, నియోజకవర్గాలను అప్పగించారన్నారు. కనీసం తాను ప్రెస్‌మీట్ పెడుతానంటే… ఎవరూ సహకరించలేదన్నారు. టీడీపీ ఆఫీస్‌ రెండో అంతస్తులో ఒకరోజు పంచుమర్తి అనురాధ, మాల్యాద్రి లాంటి వారంతా ఉన్నారని.. తాను లోపలికి వెళ్తుంటే అక్కడున్న బాయ్‌ అడ్డుకున్నారని.. ఎందుకు వెళ్లకూడదు అని ప్రశ్నిస్తే రానివ్వొద్దన్నారు అని చెప్పాడన్నారు.

టీడీ జనార్ధన్‌ అనే వ్యక్తిని ఓపెన్‌గా ప్రశ్నించిందుకు తనను ఇంతగా ఇబ్బందిపెట్టారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కేశినేని ఆఫీస్‌లో తనకు గైడెన్స్ కావాలని అడిగినప్పుడు… మీకు సపోర్టు చేస్తే మమ్మల్ని కూడా చెడ్డవారిగా చూస్తారని కేశినేని నాని అన్నారన్నారు. అందరూ సోఫాల మీద కూర్చుంటే.. ఎర్రటి ఎండకాలంలో అన్నం కూడా తినకుండా తాను నేలమీద పడుకున్నానని…. కావాలంటే కేశినేని నానిని అడగాలన్నారు.

మహానాడులో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరగా.. నేతలు కుక్కపిల్లలా తనను తిప్పుకున్నారన్నారని ఆవేదన చెందారామె. తనకు తెలియక వేదిక వద్ద కూర్చుంటే ఇద్దరు ముగ్గురు వచ్చి ఇది మా చైర్‌ లేవండి అంటే చాలా అవమానకరంగా అనిపించిందన్నారు. టీడీ జనార్ధన్ వద్దకు వెళ్లి తనకు మాట్లాడే అవకాశం ఉందా లేదా అని అడిగితే వెళ్లి పయ్యావుల కేశవ్‌ను కలువు అన్నారన్నారు. కేశవ్ వద్దకు వెళ్లి అడిగితే తనకు ఇచ్చిన లిస్టులోని వారి మాత్రమే పిలుస్తాను.. నేను నిమిత్తమాత్రుడిని అన్నారని దివ్య వాణి వివరించారు.

నెల క్రితం కేఏ పాల్ కూడా తనను పిలిపించారని, పార్టీలోకి ఆహ్వానించారన్నారు. టీడీపీ అధికారంలోకి రావాలన్న ఒక మత్తులో పని చేసినట్టు అనిపిస్తోందన్నారు. తన శవంతోనూ ఓట్లు అడుగుతారని తాను చంద్రబాబును ఉద్దేశించి అనలేదని.. అన్ని పార్టీల్లోనూ జరిగేది అదే కదా అన్న ఉద్దేశంతో చెప్పానన్నారు.

తాను వైసీపీ నేతలను ఎంత పరుషపదజాలంతో మాట్లాడిన వారు కనీసం ఎన్నడూ ఏమీ అనలేదన్నారు. తాను ఇప్పటి వరకు ఏ ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకోలేదని సొంత డబ్బుతోనే తిరిగానని.. ఎంపీలు, ఎమ్మెల్యేల వద్ద డబ్బులు తీసుకోలేదని.. తానేమీ నారి-భేరి నిర్వహిస్తానంటూ మేకప్‌లు వేసుకుని కూర్చోలేదన్నారు. అనితను తాను విమర్శించేందుకు విషయాలు చెప్పడం లేదన్నారు. అసలు పార్టీలో పోస్టులు కావాలంటే ఏం చేయాలన్న దానికి కూడా తన వద్ద ఆధారాలు ఉన్నాయని… సభ్యత ఉంది కాబట్టే వాటిని బయటపెట్టడం లేదని తన ఫోన్‌ చూపించారు దివ్యవాణి.

చంద్రబాబు పర్సనల్ పీఏ రాజగోపాల్‌కు నార్కో అనాలసిస్ పరీక్షలు చేయిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయన్నారు. చంద్రబాబు ముందు ఒకలా, ఆయన వెనుక ఇంకోలా రాజగోపాల్ తిరుగుతుంటారన్నారు. ఆఖరి రోజు చంద్రబాబును కలిసేందుకు వెళ్తే… మధ్నాహ్నం 2.45 నుంచి 7.45 వరకు లోపలకి పంపలేదన్నారు. చివరకు చంద్రబాబు వెళ్లిపోతుంటే… ఫోటోలు దిగేందుకు పబ్లిక్ వచ్చిన సమయంలో తాను చంద్రబాబు వద్దకు వెళ్లానని…
తన బాధను చెబుతుంటే… చంద్రబాబు ”హేయ్ వినమ్మ.. హేయ్ వినమ్మ” అన్నారని దివ్యవాణి చెప్పారు. తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి అనుకుని ఊరుకున్నానని.. అదే మరొకరు అలా అని ఉంటే వేరేలా ఉండేదన్నారు.

అచ్చెన్నాయుడిలా పార్టీ లేదు బొక్కా లేదు అని తాను ఏమైనా అన్నానా అని దివ్యవాణి ప్రశ్నించారు. యామినిలాగా ఇక్కడ లబ్ది పొంది బయటకు వెళ్లి తిట్టానా అని ప్రశ్నించారు. ఒక రోజు ఒక మీటింగ్‌ లో అచ్చెన్నాయుడు చెవిలో ఏదో చెప్పగానే చంద్రబాబు వెళ్లిపోయారని.. ఆ తర్వాత తాను మాట్లాడుతుండగానే మైక్‌ ఆపేసి పాటలు పెట్టండి అని అచ్చెన్నాయుడు అన్నారని దివ్యవాణి వివరించారు. అయ్యన్నపాత్రుడి కుమారుడు విజయ్, ప్రతిభ భారతి కుమార్తెగా గ్రీష్మా లాంటి వారు మహానాడులో మాట్లాడారన్నారు. దివ్యవాణికి ఎవరూ గాడ్‌ ఫాదర్‌ లేకపోవడంతోనే ఇలా అయిందన్నారు. తాను జయసుధతో మాట్లాడానని… ఆమె నోట్లో నుంచి వచ్చిన మాటలను తాను బయటకు చెబితే ఇంకా చెండాలంగా ఉంటుందన్నారు.

Tags:    
Advertisement

Similar News