బీజేపీ జాతీయ నాయకత్వాన్ని ధిక్కరిస్తున్న రాష్ట్ర శాఖ
బీజేపీ జాతీయ నాయకత్వాన్ని బీహార్ రాష్ట్ర బీజేపీ శాఖ ధిక్కరించిందా ? అగ్రనాయకత్వం వద్దన్న పనిని రాష్ట్రం చేయపూనుకుందా ? బీహార్ లో పరిస్థితి చూస్తే అవుననే జవాబు వస్తోంది. దేశవ్యాప్తంగా కుల గణన చేయాలంటూ అనేక డిమాండ్ లు ఉన్నప్పటికీ బీజేపీ ప్రభుత్వ దాన్ని వ్యతిరేకిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కుల గణన చేయడానికి ఆ పార్టీ నాయకత్వం సిద్దంగా లేదు. అయితే అందుకు విరుద్దంగా ఆ పార్టీ బీజేపీ శాఖ వ్యవహరిస్తోంది. బీహార్ రాష్ట్రంలో కుల […]
బీజేపీ జాతీయ నాయకత్వాన్ని బీహార్ రాష్ట్ర బీజేపీ శాఖ ధిక్కరించిందా ? అగ్రనాయకత్వం వద్దన్న పనిని రాష్ట్రం చేయపూనుకుందా ? బీహార్ లో పరిస్థితి చూస్తే అవుననే జవాబు వస్తోంది.
దేశవ్యాప్తంగా కుల గణన చేయాలంటూ అనేక డిమాండ్ లు ఉన్నప్పటికీ బీజేపీ ప్రభుత్వ దాన్ని వ్యతిరేకిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కుల గణన చేయడానికి ఆ పార్టీ నాయకత్వం సిద్దంగా లేదు. అయితే అందుకు విరుద్దంగా ఆ పార్టీ బీజేపీ శాఖ వ్యవహరిస్తోంది. బీహార్ రాష్ట్రంలో కుల గణన చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీష్ కుమార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన ప్రయత్నాలకు అన్ని పక్షాలతో పాటు బీజేపీ కూడా అండగా నిల్చింది.
కుల గణన అంశంపై పార్టీతో విభేదిస్తూ, రాష్ట్ర శాఖ కుల గణనకు అనుకూలంగా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. నిన్నఇదే విషయంపై ముఖ్యమంత్రి నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో జేడీయూ, ఆర్జేడీ, ఎమ్ ఐ ఎమ్ తో సహా బీజేపీ కూడా పాల్గొని కుల గణనకు అనుకూలంగా తీర్మానం చేశారు.
అఖిలపక్ష సమావేశం అనంతరం ముఖ్యమంత్రి, జెడి (యు) నాయకుడు నితీష్ కుమార్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కుల గణన చేయలేమని కేంద్రం స్పష్టం చేసినందున, రాష్ట్రం తన స్వంత కుల గణనను నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
”మొత్తం తొమ్మిది పార్టీలు ఏకగ్రీవంగా కుల గణనను చేపట్టాలని నిర్ణయించాయి. మేము త్వరలో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం పొందుతాము. ఈ కార్యక్రమం అమలు కోసం నిధులు కేటాయిస్తాము. మేము ప్రక్రియను సరిగ్గా ప్రచారం చేస్తాము. ప్రక్రియ పూర్తి చేయడానికి గడువును నిర్దేశిస్తాము, ”అని నితీష్ చెప్పాడు.
బీజేపీతో సహా అన్ని బీహార్ లోని అన్ని పార్టీలు దేశవ్యాప్తంగా కుల గణన చేయాలనే అభ్యర్థనతో గతేడాది ప్రధానిని కలిశాయని చెప్పారు.
“దేశవ్యాప్తంగా కుల గణన చేయలేమని కేంద్రం ఇప్పుడు స్పష్టం చేయడంతో, మేము రాష్ట్ర జనాభా గణనతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాము. దానిపై పూర్తి ఏకాభిప్రాయం ఉంది, ”అని ఆయన అన్నారు.
ఈ సమావేశానికి బీజేపీ నుంచి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్, ఉప ముఖ్యమంత్రి తార్కిషోర్ ప్రసాద్ హాజరయ్యారు. ఆర్జేడీ తరపున ప్రతిపక్ష నేత తేజస్వీ ప్రసాద్ యాదవ్, రాజ్యసభ ఎంపీ మనోజ్ కుమార్ ఝా పాల్గొన్నారు. ఏఐఎంఐఎం బీహార్ చీఫ్ అక్తరుల్ ఇమాన్ కూడా హాజరయ్యారు.
మరో వైపు కొన్ని నెలల క్రితం, బీహార్‌కు చెందిన సీనియర్ బిజెపి నాయకుడు, హోం వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద రాయ్ కుల గణన చేయలేమని పార్లమెంటులో స్పష్టంగా చెప్పారు.
కుల గణన సమస్యాత్మకమైనదే కాదు తప్పుడు సంకేతాలు పంపుతోంది అని ఆయన అన్నారు. పైగా అది అసాధ్యం కూడా అని ఆయన పేర్కొన్నారు.
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గురు ప్రకాష్ పాశ్వాన్ మాట్లాడుతూ కుల గణన ఒక్కదాని వల్లే సామాజిక న్యాయం జరగదని, ‘సబ్కా సాత్, సబ్‌కా వికాస్’ లక్ష్యాన్ని సాధించేందుకు పార్టీ అనేక చర్యలు చేపట్టిందని అన్నారు. ఓబీసీలపై బీజేపీ జాతీయ ప్యానెల్‌ను ఏర్పాటు చేసిందని, మోదీ ప్రభుత్వంలో 27 మంది ఓబీసీ మంత్రులను చేర్చుకున్నామని చెప్పారు.
కానీ బీహార్ బీజేపీ మాత్రం కేంద్ర నాయకత్వం,ఆటలను పెడచెవిన పెట్టి కుల గణన చేయడానికి అనుకూలంగా ముందుకు సాగుతోంది. మరి తమను ధిక్కరిస్తున్న రాష్ట్ర శాఖపట్ల జాతీయ నాయకత్వం ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాలి.