ఇంతకీ కరోనా ఉన్నట్టా..? లేనట్టా..?

కరోనా ఫోర్త్ వేవ్ అన్నారు, కేసులు పెరుగుతున్నాయ్ అన్నారు, పాజిటివిటీ రేటు పెరిగిపోతోందన్నారు.. ఆ తర్వాత అంతగా భయపడాల్సిందేమీ లేదంటూ చల్లనివార్త చెప్పారు. ఇదిగో మళ్లీ ఇప్పుడు కరోనా కలవరంపై వార్తలొస్తున్నాయి. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు.. అదిగో ముంబైలో కరోనా విజృంభిస్తోంది అని చెబుతున్నారు. అవును, నిజంగానే ముంబైలో కరోనా విజృంభిస్తోంది. అయితే ఈ విజృంభణ ఎన్నిరోజులు, నిజంగానే దీనివల్ల రాష్ట్రమంతా ఇబ్బందిపడుతుందా, అది మెల్లగా దేశవ్యాప్తంగా అందర్నీ ఇబ్బంది పెడుతుందా అనేది […]

Advertisement
Update:2022-06-01 13:56 IST

కరోనా ఫోర్త్ వేవ్ అన్నారు, కేసులు పెరుగుతున్నాయ్ అన్నారు, పాజిటివిటీ రేటు పెరిగిపోతోందన్నారు.. ఆ తర్వాత అంతగా భయపడాల్సిందేమీ లేదంటూ చల్లనివార్త చెప్పారు. ఇదిగో మళ్లీ ఇప్పుడు కరోనా కలవరంపై వార్తలొస్తున్నాయి. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు.. అదిగో ముంబైలో కరోనా విజృంభిస్తోంది అని చెబుతున్నారు. అవును, నిజంగానే ముంబైలో కరోనా విజృంభిస్తోంది. అయితే ఈ విజృంభణ ఎన్నిరోజులు, నిజంగానే దీనివల్ల రాష్ట్రమంతా ఇబ్బందిపడుతుందా, అది మెల్లగా దేశవ్యాప్తంగా అందర్నీ ఇబ్బంది పెడుతుందా అనేది మాత్రం ప్రశ్నార్థకం.

ముంబై సంగతేంటి..?

ముంబైలో కరోనా తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం కొవిడ్‌ పాజిటివిటీ రేటు 6శాతానికి పెరిగింది. ముందు జాగ్రత్తగా ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌.. కొవిడ్‌ పరీక్షలను భారీగా పెంచింది. పూర్తిస్థాయిలో పారిశుధ్య, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించింది.

ముంబై నగరంలో మంగళవారం ఒక్కరోజే 506 మందికి కొత్తగా కొవిడ్‌ సోకింది. ఈ ఏడాది ఫిబ్రవరి 6 తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఏప్రిల్ తో పోల్చి చూస్తే మే నెలలో కేసుల సంఖ్య రెట్టింపైంది. రోజువారీ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. మరోవైపు రుతుపవనాలు సమీపిస్తుండటంతో.. వర్షాల వల్ల కొవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందనే అనుమానం కూడా ఉంది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. బూస్టర్ డోస్ పంపిణీని వేగవంతం చేయాలని వైద్య సిబ్బందికి ఆదేశాలిచ్చారు.

ఇక దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు క్రమక్రమంగా తగ్గుతూ వచ్చినా.. నిన్న ఒక్కరోజే భారీగా కేసులు నమోదు కావడం విశేషం. మంగళవారం 2745 కొవిడ్ కేసులు నమోదు కావడంతో భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 18వేల మార్కు మళ్లీ దాటింది. దేశవ్యాప్తంగా సగటున కొవిడ్ పాజిటివిటీ రేటు కేవలం 0.6 శాతం మాత్రమే. అయితే ముంబైలో మాత్రం 6 శాతం దాటడం ఆందోళన కలిగించే విషయం.

Tags:    
Advertisement

Similar News