హిందువుల సొమ్ముతో లవ్ జీహాదీ చేస్తున్నారా ?

సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత అసలు ఏది నిజమో? ఏది అబద్దమో తెలియకుండా పోయింది. ముఖ్యంగా వాట్సప్ ఫార్వర్డ్స్ ద్వారా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చూస్తున్నారు. దీంతో ఏ విషయమూ తెలియని వాళ్లు కూడా వాట్సప్ వార్త నిజమే అనుకొని భ్రమపడుతున్నారు. అలాంటి ఫేక్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్నది. కొంత మంది ముస్లింలు కలిసి కూర్చొని నోట్లు లెక్కిస్తున్న ఫొటోను పెట్టి.. ఇది అజ్మీర్ దర్గాలో హిందువులు వేసిన కానుకలని.. ఈ […]

Advertisement
Update:2022-06-01 06:19 IST

సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత అసలు ఏది నిజమో? ఏది అబద్దమో తెలియకుండా పోయింది. ముఖ్యంగా వాట్సప్ ఫార్వర్డ్స్ ద్వారా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చూస్తున్నారు. దీంతో ఏ విషయమూ తెలియని వాళ్లు కూడా వాట్సప్ వార్త నిజమే అనుకొని భ్రమపడుతున్నారు. అలాంటి ఫేక్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్నది. కొంత మంది ముస్లింలు కలిసి కూర్చొని నోట్లు లెక్కిస్తున్న ఫొటోను పెట్టి.. ఇది అజ్మీర్ దర్గాలో హిందువులు వేసిన కానుకలని.. ఈ డబ్బుతో సదరు వర్గం లవ్ జీహాద్‌లకు చేస్తుంటుందని విపరీతమైన ద్వేషంతో కూడిన మెసేజ్‌ను సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేస్తున్నారు.

కాగా, అసలు ఈ ఫొటో ఏంటని కొన్ని ఫ్యాక్ట్ చెక్ సైట్లు పరిశీలించగా.. అసలు అజ్మీర్ దర్గాకు చెందిన ఫొటోనే కాదని స్పష్టమైంది. ఫొటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. పాకిస్తాన్‌లోని లాహోర్ నగరంలో ఉన్న డేటా దర్బార్ మసీదుకు చెందినదిగా చూపిస్తోంది. 2015లో తీసిన ఈ ఫొటోలో మసీదు లోని పనివాళ్లు చారిటీకి సంబంధించిన ఆదాయాన్ని లెక్కిస్తుండగా తీసిన ఫొటో అది. పాకిస్తాన్‌కు చెందిన ‘Quaid TV’ కూడా ఇదే విషయాన్ని తమ వెబ్‌సైట్‌లో పబ్లిష్ చేసింది. డేటా మసీదు వెబ్‌సైట్ కూడా తమ ఫొటోను పెట్టుకున్నది.

మొత్తానికి పాకిస్తాన్‌కు చెందిన ఫొటోను అజ్మీర్ పేరుతో ఇక్కడ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి విద్వేషపూర్వకమైన విషయాలను షేర్ చేసి గొడవలకు కారణం అవుతున్నారు. కాబట్టి యూజర్లు ఇలాంటి తప్పుడు వార్తల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్నారు.

Tags:    
Advertisement

Similar News