మద్దతు ఇవ్వను.. నేను పోటీ చేస్తా

మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ విషయాన్ని పార్టీ నాయకత్వానికి కూడా చెప్పానన్నారు. గత ఎన్నికల్లో మాత్రమే తాను పోటీ చేయకుండా మరొకరికి మద్దతు ఇచ్చానని.. ఈసారి ఆ పరిస్థితి ఉండదన్నారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయకుండా మద్దతు ఇవ్వడంతో.. ఈసారి కూడా సుబ్బారాయుడిని రిక్వెస్ట్ చేసుకుని మద్దతు పొందాలన్న ఆలోచనతో కొందరున్నారని వ్యాఖ్యానించారు. అందుకే ప్రజలకు, కార్యకర్తలకు, నేతలకు స్పష్టత ఉండాలన్న ఉద్దేశంతోనే తాను వివరణ ఇస్తున్నానని.. […]

Advertisement
Update:2022-05-31 15:13 IST

మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ విషయాన్ని పార్టీ నాయకత్వానికి కూడా చెప్పానన్నారు. గత ఎన్నికల్లో మాత్రమే తాను పోటీ చేయకుండా మరొకరికి మద్దతు ఇచ్చానని.. ఈసారి ఆ పరిస్థితి ఉండదన్నారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయకుండా మద్దతు ఇవ్వడంతో.. ఈసారి కూడా సుబ్బారాయుడిని రిక్వెస్ట్ చేసుకుని మద్దతు పొందాలన్న ఆలోచనతో కొందరున్నారని వ్యాఖ్యానించారు.

అందుకే ప్రజలకు, కార్యకర్తలకు, నేతలకు స్పష్టత ఉండాలన్న ఉద్దేశంతోనే తాను వివరణ ఇస్తున్నానని.. ఈసారి వంద శాతం తానే నర్సాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు. వైసీపీ నుంచే 99.9 శాతం పోటీ చేస్తానని తాను అనుకుంటున్నానని.. ఒకవేళ టికెట్ రాకపోతే ఇండిపెండెంట్‌ అభ్యర్థిగానైనా తాను పోటీ చేస్తానని ప్రకటించారు. ఇందులో ఎవరికీఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తనకు నామినేటెడ్ పదవులపై ఇష్టం లేదని.. నేరుగా ఎన్నికల్లో పోటీకే తాను ఇష్టపడుతానన్నారు.

జిల్లా కేంద్రం కోసం కొత్తపల్లి సుబ్బారాయుడు ఇటీవల గట్టిగా ఫైట్ చేశారు. ఆసమయంలో వైసీపీ ఎమ్మెల్యే ప్రసాద్‌రాజుకు ఎన్నికల్లో మద్దతు ఇచ్చినందుకు చెప్పుతో కొట్టుకున్నారు. వైసీపీ నాయకత్వం నుంచి సుబ్బారాయుడికి అంతే స్థాయిలో కౌంటర్ వచ్చింది. కొద్దిరోజుల క్రితం సుబ్బారాయుడికి ఉన్న గన్‌మెన్లను కూడా తొలగించారు. అంతటితో ఆగకుండా జిల్లా కేంద్రం కోసం జరిగిన ఆందోళనల్లో సుబ్బారాయుడిపై కేసు నమోదు చేసి ఏ-1గా చేర్చారు. నోటీసులు జారీ చేశారు. ఇలా తనకు నోటీసులు జారీ చేయడం హాస్యాస్పదమని సుబ్బారాయుడు వ్యాఖ్యానించారు. గన్‌మెన్ల తొలగింపుపై మాత్రం ఆయన స్పందించలేదు.

Tags:    
Advertisement

Similar News