టార్గెట్ తెలంగాణ.. బీజేపీ తర్వాతి నేషనల్ ఎగ్జిక్యూటీవ్ మీటింగ్ హైదరాబాద్ లోనే.. !

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తమ ఫోకస్ దక్షిణాది రాష్ట్రాలపై పెట్టింది. ఇప్పటికే కర్ణాటకలో అధికారంలో ఉన్న ఆ పార్టీ.. తాజాగా తెలంగాణపై దృష్టి పెట్టింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో విస్తృతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తుంది. ఇటీవల వరుసగా ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటనలు నిర్వహించారు. ఈ మధ్య కాలంలో ఏ రాష్ట్రంపై పెట్టనంత ఫోకస్ తెలంగాణపై బీజేపీ […]

Advertisement
Update:2022-05-30 10:09 IST

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తమ ఫోకస్ దక్షిణాది రాష్ట్రాలపై పెట్టింది. ఇప్పటికే కర్ణాటకలో అధికారంలో ఉన్న ఆ పార్టీ.. తాజాగా తెలంగాణపై దృష్టి పెట్టింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో విస్తృతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తుంది. ఇటీవల వరుసగా ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటనలు నిర్వహించారు. ఈ మధ్య కాలంలో ఏ రాష్ట్రంపై పెట్టనంత ఫోకస్ తెలంగాణపై బీజేపీ అధిష్టానం పెట్టింది. రాష్ట్ర నాయకత్వం కూడా పదే పదే జాతీయ నాయకులను రాష్ట్రానికి రప్పించి తమ బలం నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తోంది. కేరళ, తమిళనాడులో తమ వ్యూహాలను స్టార్ట్ చేసినా.. ఇప్పట్లో అవి సఫలం అయ్యే అవకాశాలు లేవు. అందుకే తెలంగాణే తమ టార్గెట్‌గా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

బీజేపీ జాతీయ కార్యనిర్వాహక సమావేశం ఈ సారి హైదరాబాద్ వేదికగా నిర్వహించేందుకు పార్టీ రంగం సిద్ధం చేస్తుంది. జూలై రెండో వారంలో ఈ సమావేశం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులు తమ వద్ద ఈ సమావేశం నిర్వహించాలని ఒత్తిడి తెస్తున్నారు. ముఖ్యంగా రాజస్థాన్ క్యాడర్ ఈ ఎగ్జిక్యూటీవ్ మీటింగ్ కోసం ఉత్సాహంగా ఉంది. ఇటీవల జాతీయ స్థాయి సమావేశాలు కూడా ఆ రాష్ట్రంలో విజయవంతంగా నిర్వహించారు. దీంతో ఎగ్జిక్యూటీవ్ మీటింగ్ కూడా నిర్వహిస్తామని పట్టుబడుతున్నారు.

కాగా, కాంగ్రెస్ పార్టీ కూడా తమ చింతన్ శిబిర్ ఆ రాష్ట్రంలోనే నిర్వహించింది. అందుకే బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో.. ముఖ్యంగా బీజేపీ అధికారంలో లేని రాష్ట్రంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి సుముఖంగా ఉన్నది. హైదరాబాద్‌ ఈ సమావేశానికి సరైన వేదిక అని చాలా మంది భావిస్తున్నారు. ఈ సమావేశానికి బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో పాటు సీఎం మోడీ కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.

బీజేపీ చివరి సారిగా 2004లో ఎగ్జిక్యూటీవ్ మీటింగ్‌ను హైదరాబాద్‌లో నిర్వహించింది. అయితే ఆ సమయంలో వైఎస్ఆర్ తొలి సారిగా ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో రాష్ట్రంలో బీజేపీ ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. ఈ సారి కనుక హైదరాబాద్ వేదికగా సమావేశం నిర్వహిస్తే.. కచ్చితంగా అధికార టీఆర్ఎస్‌కు గట్టి సమాధానం చెప్పవచ్చని.. అంతే కాకుండా క్యాడర్‌లో మరింత ఉత్సాహం తేవొచ్చని అధినాయకత్వం భావిస్తుంది. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంలో హైదరాబాద్‌నే వేదికగా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు బీజేపీ నాయకుడు, మాజీ మండలి చైర్మన్ స్వామి గౌడ్ కూడా హింట్ ఇవ్వడం గమనార్హం.

Tags:    
Advertisement

Similar News