షారుఖ్ ఖాన్ కొడుకు గంజాయి తాగడం అమెరికాలోనే మొదలుపెట్టాడు

బాలీవుడ్ మెగాస్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అమెరికాలో చదువుతున్నప్పుడే గంజాయి తాగడం అలవాటు చేసుకున్నాడని ఎన్ సీబీ చెప్పింది. క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఎన్ సీబీ ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్ ఇచ్చింది. 14 మందిపై కోర్టులో 6వేల పేజీల చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ చార్జ్ షీట్ లో రికార్డ్ చేసిన ఆర్యన్ ఖాన్ వాగ్మూలాన్ని కూడా నమోదు చేసింది. అందులో తాను గంజాయి తాగినట్టు స్వయంగా ఆర్యన్ […]

Advertisement
Update:2022-05-30 06:18 IST

బాలీవుడ్ మెగాస్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అమెరికాలో చదువుతున్నప్పుడే గంజాయి తాగడం అలవాటు చేసుకున్నాడని ఎన్ సీబీ చెప్పింది. క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఎన్ సీబీ ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్ ఇచ్చింది. 14 మందిపై కోర్టులో 6వేల పేజీల చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ చార్జ్ షీట్ లో రికార్డ్ చేసిన ఆర్యన్ ఖాన్ వాగ్మూలాన్ని కూడా నమోదు చేసింది. అందులో తాను గంజాయి తాగినట్టు స్వయంగా ఆర్యన్ ఖాన్ అంగీకరించాడు.

ఆర్యన ఖాన్ 2018లో గ్రాడ్యుయేషన్ కోసం యునైటెడ్ స్టేట్స్‌లో చదువుతున్నప్పుడు గంజాయి ఉపయోగించడం ప్రారంభించినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB)ముందు అంగీకరించాడు. NDPS చట్టం, 1985, సెక్షన్ 67 ప్రకారం ఆర్యన్ యొక్క ‘స్వచ్ఛంద ప్రకటన’, శుక్రవారం (మే 27) నాడు ప్రత్యేక NDPS కోర్టులో NCB దాఖలు చేసింది.

అతను ఆ సమయంలో నిద్ర సమస్యలతో బాధపడుతున్నాడని, ఆ సమస్యల నుండి బైటపడేందుకు గంజాయి సహాయం చేయగలదని ఇంటర్నెట్‌లో కథనాలను చదివానని చెప్పాడు. గత ఏడు,ఎనిమిదేళ్లుగా మరో సహ నిందితుడు అర్బాజ్ మర్చంట్‌తో తనకు స్నేహం ఉందని ఆర్యన్ తెలిపాడు. ఆర్యన్ తన స్నేహితులైన ప్రతీక్, మానవ్, అర్బాజ్‌లతో కలిసి కార్డెలియా క్రూయిజ్ ఎక్కేందుకు అక్టోబర్ 2, 2021నతన మెర్సిడెస్ కారులో ముంబై ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ (ICT)కి వెళ్లాడు. అయితే అక్కడికి గంజాయి, డ్రగ్స్ తీసుకరావద్దని ఆర్యన్ అర్బాజ్ కు చెప్పాడు.

మాదకద్రవ్యాల కోసం వాట్సప్ లో తాను చాట్ చేసింది నిజమే అని ఆర్యన్ ఖాన్ ఒప్పుకున్నాడు. ఒక డ్రగ్ డీలర్ కూడా తనకు తెలుసునని అయితే అతనికి సంబంధించి వివరాలు మాత్రం తెలియదని ఆర్యన్ ఖాన్ ఎన్ సీబీ అధికారులకు చెప్పాడు. అయితే క్రూయిజ్ షిప్ పై మాదకద్రవ్యాలతో తనకు సంబంధం లేదని ఆర్యన్ ఖాన్ స్పష్టం చేశాడు.

Tags:    
Advertisement

Similar News