అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కొత్త కోర్సులు

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) లో వచ్చే విద్యా సంవత్సరం (2023-24) నుంచి రెండు కొత్త కోర్పులు ప్రవేశ పెట్టనున్నట్లు అధికారులు చెప్పారు. బీఏ కోర్సులో భాగంగా జాగ్రఫీ, ఇంటర్నేషనల్ స్టడీస్ సబ్జెక్టులను కొత్తగా తీసుకొని రానున్నారు. ఇటీవల సివిల్స్, గ్రూప్-1 ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షల్లో వీటికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్దం అయ్యే అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని ఈ కోర్సులు మొదలుపెట్టబోతున్నట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు. జాగ్రఫీతో పాటు […]

Advertisement
Update:2022-05-29 04:54 IST

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) లో వచ్చే విద్యా సంవత్సరం (2023-24) నుంచి రెండు కొత్త కోర్పులు ప్రవేశ పెట్టనున్నట్లు అధికారులు చెప్పారు. బీఏ కోర్సులో భాగంగా జాగ్రఫీ, ఇంటర్నేషనల్ స్టడీస్ సబ్జెక్టులను కొత్తగా తీసుకొని రానున్నారు. ఇటీవల సివిల్స్, గ్రూప్-1 ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షల్లో వీటికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్దం అయ్యే అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని ఈ కోర్సులు మొదలుపెట్టబోతున్నట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు.

జాగ్రఫీతో పాటు ఇంటర్నేషనల్ స్టడీస్‌కి కూడా ఈ మధ్య ఎక్కువ డిమాండ్ ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొనే ఈ కోర్సులు స్టార్ట్ చేయనున్నారు.

ఇక వర్సిటీ ఏర్పడినప్పటి నుంచి సాంప్రదాయ కోర్సులను నిర్వహిస్తున్న వర్సిటీ.. ఇకపై ఆన్‌లైన్ కోర్సులను కూడా అమలు చేయడానికి రంగం సిద్దం చేసింది. ఇప్పటికే మేనేజ్‌మెంట్, జనరల్ స్టడీస్ కోర్సులను ఆన్‌లైన్ పద్దతితో బోధిస్తున్నారు. వర్సిటీ ద్వారా టెలీ క్లాసెస్ తీసుకుంటున్నారు. వీటిని యూట్యూబ్ చానల్, మొబైల్ యాప్‌లో కూడా అందుబాటులోకి తీసుకొని రానున్నారు. వర్సిటీకి ఉన్న సొంత వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ కోర్సులను విద్యార్థులు పొందే అవకాశం ఉన్నది. కొత్తగా ప్రవేశ పెట్టనున్న కోర్సులను కూడా ఆన్‌లైన్ పద్దతిలో బోధించనున్నారు.

Tags:    
Advertisement

Similar News