ఆ రైలు ఏడాది ఆలస్యంగా గమ్యస్థానం చేరింది.. 762 కిలోమీటర్ల ప్రయాణానికి ఏడాది పట్టింది..!

ఒక రైలు బయలుదేరిన తర్వాత గమ్యస్థానానికి చేరడానికి ఏడాది సమయం పట్టిందంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ఇది నిజంగా జరిగిన ఘటన. ఏ రైలు అయినా ఒకటి రెండు నిమిషాలో.. లేదంటే కొన్ని గంటల ఆలస్యంగానో నడవటం సహజమే. మార్గమధ్యంలో ఏర్పడే సాంకేతిక సమస్యల కారణంగా ఒకటి రెండు రోజులు ఆలస్యం అవుతుంటాయి. కానీ గత ఏడాది చత్తీస్‌గడ్‌లో బయలుదేరిన ఒక గూడ్స్ రైలు జార్ఖండ్‌లోని న్యూగిరిడీకి చేరుకోవడానికి అచ్చంగా ఏడాది పట్టింది. 2021 మేలో ఒక […]

Advertisement
Update:2022-05-28 04:41 IST

ఒక రైలు బయలుదేరిన తర్వాత గమ్యస్థానానికి చేరడానికి ఏడాది సమయం పట్టిందంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ఇది నిజంగా జరిగిన ఘటన. ఏ రైలు అయినా ఒకటి రెండు నిమిషాలో.. లేదంటే కొన్ని గంటల ఆలస్యంగానో నడవటం సహజమే. మార్గమధ్యంలో ఏర్పడే సాంకేతిక సమస్యల కారణంగా ఒకటి రెండు రోజులు ఆలస్యం అవుతుంటాయి. కానీ గత ఏడాది చత్తీస్‌గడ్‌లో బయలుదేరిన ఒక గూడ్స్ రైలు జార్ఖండ్‌లోని న్యూగిరిడీకి చేరుకోవడానికి అచ్చంగా ఏడాది పట్టింది.

2021 మేలో ఒక గూడ్సు రైలులో వెయ్యి బియ్యం బస్తాలు నింపారు. అది జార్ఖండ్ వెళ్లాల్సి ఉన్నది. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో ఆ రైలు నిర్ణీత సమయానికి బయలుదేరలేదు. ఆ తర్వాత ఆ రైలును ముందుకు కదిలించే నాథుడే లేకపోయాడు. ఆ తర్వాత అధికారులకు విషయం తెలిసి రైలును 762 కిలోమీటర్ల దూరం ఉన్న న్యూగిరిడీ స్టేషన్‌కు పంపారు. మొత్తానికి 1000 బియ్యం బస్తాలతో ఆ రైలు ఏడాది తర్వాత ఈ నెల 17న గమ్యస్థానానికి చేరుకున్నది.

ఏడాది పాటు గూడ్స్ రైలు బోగీల్లో బియ్యం బస్తాలు ఉండటంతో చాలా వరకు పాడయ్యాయని అధికారులు చెప్తున్నారు. మొత్తం బియ్యాన్ని అన్‌లోడ్ చేయగా 300 బస్తాల వరకు చెడిపోయాయని అంటున్నారు. మరోవైపు ఈ రైలు ఏడాది ఆలస్యం కావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకోవడానికి ఉన్నతాధికారులు దర్యాప్తుకు ఆదేశించారు.

Tags:    
Advertisement

Similar News