ఫేస్‌బుక్ హెచ్చరించి ఉంటే ఆ మారణహోమం జరిగేది కాదా? నిపుణులు చెప్తున్నది ఏంటంటే...

అమెరికాలోని ఓ ఎలిమెంటరీ స్కూల్‌లో ఉన్మాది కాల్పులు జరిపి 19 మంది చిన్నారులతో పాటు ఇద్దరు టీచర్లను బలిగొన్న విషయం తెలిసిందే. అయితే ఫేస్‌బుక్ కనుక కాస్త త్వరగా స్పందించి ఉంటే ఈ మారణహోమం జరిగేది కాదనే చర్చ జరుగుతోంది. ఎటాక్ జరగడానికి నిమిషాల మందు ఉస్మాది ఫేస్‌బుక్ ద్వారా కొంత మందికి డైరెక్ట్ మెసేజీలు పెట్టాడు. తాను చేయబోతున్న హత్యల విషయం ఈ మెసేజీల్లో చర్చించాడు. ఫేస్‌బుక్ తమ అల్గారిథమ్స్ ద్వారా ఆ మెసేజీలను గుర్తించి […]

Advertisement
Update:2022-05-27 09:42 IST

అమెరికాలోని ఓ ఎలిమెంటరీ స్కూల్‌లో ఉన్మాది కాల్పులు జరిపి 19 మంది చిన్నారులతో పాటు ఇద్దరు టీచర్లను బలిగొన్న విషయం తెలిసిందే. అయితే ఫేస్‌బుక్ కనుక కాస్త త్వరగా స్పందించి ఉంటే ఈ మారణహోమం జరిగేది కాదనే చర్చ జరుగుతోంది. ఎటాక్ జరగడానికి నిమిషాల మందు ఉస్మాది ఫేస్‌బుక్ ద్వారా కొంత మందికి డైరెక్ట్ మెసేజీలు పెట్టాడు. తాను చేయబోతున్న హత్యల విషయం ఈ మెసేజీల్లో చర్చించాడు. ఫేస్‌బుక్ తమ అల్గారిథమ్స్ ద్వారా ఆ మెసేజీలను గుర్తించి వెంటనే హెచ్చరించి ఉంటే ఈ రక్తపాతం జరిగేది కాదని టెక్సాస్ గవర్నర్ గ్రెట్ అబాట్ అన్నారు.

కాల్పులు జరిపిన ఉన్మాది ఫేస్‌బుక్‌ వాల్‌పై పోస్టులు పెట్టకుండా.. చాలా మందికి వన్-టూ-వన్ మెసేజీలు చేశాడు. ఈ విషయంపై సదరు సంస్థ వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఫేస్‌బుక్ డేటా పాలసీ ప్రకారం వ్యక్తిగత మెసేజీలను చదవడం ఉండదు. కేవలం పబ్లిక్ పోస్టులను మాత్రం రివ్యూ చేస్తుంటుంది. అందుకే ఆ మెసేజీలపై మెటా సంస్థ వెంటనే అప్రమత్తం చేయలేకపోయిందని నిపుణులు చెప్తున్నారు.

మెటా ఏం చేప్తోంది?

ఫేస్‌బుక్‌లో వన్-టూ-వన్ (వ్యక్తిగతంగా పంపే) సందేశాలను మానిటర్ చేస్తామని చెప్పింది. చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్, హార్మ్ ఫుల్ కంటెంట్‌ను గుర్తిస్తామని అన్నది. అలాగే మాల్‌వేర్‌కు సంబంధించిన లింకులను కూడా గుర్తించి వాటిని ఆపేస్తామని అన్నది. అయితే ఏదైనా పాట లిరిక్స్, జోక్స్, సెటైర్లు మెసేజీల్లో పెడితే వాటిని హార్మ్‌ఫుల్ కేటగిరిలోకి చేర్చమని అన్నది. ‘గోయింగ్ టూ కిల్’. ‘గోయింగ్ టూ షూట్’ అనే పదాలను వాడినప్పుడు వాటి సీరియస్‌నెస్ ఫేస్‌బుక్‌కు అర్దం కాదని చెప్పింది. సాధారణంగా కొన్ని కంపెనీలు ఉద్యోగిని తొలగించబోతున్నప్పుడు గోయింగ్‌టూ ఫైర్, గోయింట్ టూ షూట్ అనే పదాలను ఉద్యోగులు వాడుతుంటారని.. ఆ మెసేజ్‌లోని సీరియస్‌నెస్ కేవలం సందేశం పంపిన, అందుకున్న వాళ్లకు మాత్రమే తెలుస్తాయని మెటా వివరించింది. అందుకే సదరు ఉన్మాది పంపిన మెసేజెస్ తాము గుర్తించలేకపోయామని వెల్లడించింది. అయితే, సందేశం అందుకున్న వాళ్లు వెంటనే అప్రమత్తం చేసుంటే ఆ మారణహోమాన్ని ఆపగలిగేవారని ఫేస్‌బుక్ అభిప్రాయపడింది.

Tags:    
Advertisement

Similar News