సెక్స్‌ వర్క్‌ చట్టబద్ధమైన వృత్తే,పోలీసులు జోక్యం చేసుకోరాదు -సుప్రీం కోర్టు

వ్యభిచారం చట్టబద్దమైనదని, సెక్స్ వర్కర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు పోలీసులను ఆదేశించింది. వారు చట్టప్రకారం పౌరులందరిలాగానే గౌరవానికి, సమాన రక్షణకు అర్హులని పేర్కొంది. జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సెక్స్ వర్కర్ల హక్కులను కాపాడేందుకు ఆదేశాలు జారీ చేసింది. “పౌరులందరిలాగే సెక్స్ వర్కర్లు చట్ట రక్షణకు అర్హులు” అని బెంచ్ పేర్కొంది. సెక్స్ వర్కర్ మేజర్ అయితే, తన‌ సమ్మతితో సెక్స్ లో పాల్గొంటూ ఉంటే పోలీసులు జోక్యం చేసుకోవడం, క్రిమినల్ […]

Advertisement
Update:2022-05-27 03:02 IST

వ్యభిచారం చట్టబద్దమైనదని, సెక్స్ వర్కర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు పోలీసులను ఆదేశించింది. వారు చట్టప్రకారం పౌరులందరిలాగానే గౌరవానికి, సమాన రక్షణకు అర్హులని పేర్కొంది.

జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సెక్స్ వర్కర్ల హక్కులను కాపాడేందుకు ఆదేశాలు జారీ చేసింది. “పౌరులందరిలాగే సెక్స్ వర్కర్లు చట్ట రక్షణకు అర్హులు” అని బెంచ్ పేర్కొంది. సెక్స్ వర్కర్ మేజర్ అయితే, తన‌ సమ్మతితో సెక్స్ లో పాల్గొంటూ ఉంటే పోలీసులు జోక్యం చేసుకోవడం, క్రిమినల్ చర్యలు తీసుకోవడం చేయరాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఈ దేశంలో వృత్తితో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి గౌరవప్రదంగా జీవించే హక్కు ఉందని సుప్రీం తేల్చి చెప్పింది.

స్వచ్ఛంద లైంగిక పని చట్టవిరుద్ధం కాదు. అయితే వ్యభిచార గృహాన్ని నిర్వహించడం మాత్రం చట్టవిరుద్ధం. అలా నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి కానీ స్వచ్చందంగా సెక్స్ వర్క్ చేస్తున్న వారిని అరెస్టు చేయడం, జరిమానాలు, వేధింపులు లాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు బెంచ్ ఆదేశించింది.

సెక్స్ ట్రేడ్‌లో ఉన్నారనే కారణంతో సెక్స్ వర్కర్ యొక్క బిడ్డను తల్లి నుండి వేరు చేయకూడదని కోర్టు పేర్కొంది. “మానవ మర్యాద, గౌరవానికి సంబంధించిన ప్రాథమిక రక్షణ సెక్స్ వర్కర్లు, వారి పిల్లలకు కూడా వర్తిస్తుంది” అని కోర్టు పేర్కొంది.

ఒక మైనర్ వ్యభిచార గృహంలో లేదా సెక్స్ వర్కర్లతో నివసిస్తున్నట్లు గుర్తించబడితే, ఆ బాలికను అక్రమ రవాణా చేసినట్లు భావించకూడదని సుప్రీం కోర్టు పేర్కొంది.

ఫిర్యాదు చేసిన సెక్స్ వర్కర్లపై వివక్ష చూపవద్దని, ముఖ్యంగా వారిపై లైంగిక నేరం జరిగినట్లయితే, వారి పట్ల అస్సలు వివక్ష చూపవద్దని కోర్టు పోలీసులను ఆదేశించింది. లైంగిక వేధింపులకు గురైన సెక్స్ వర్కర్లకు తక్షణ వైద్య,చట్టపరమైన సంరక్షణతో సహా ప్రతి సౌకర్యాన్ని అందించాలని కోర్టు ఆడేశించింది.

“సెక్స్ వర్కర్ల పట్ల పోలీసుల వైఖరి తరచుగా క్రూరంగా, హింసాత్మకంగా ఉంటుంది. వారికి హక్కులే లేవన్నట్టు ప్రవర్తిస్తున్నారు.’’ అని చెప్పిన కోర్టు పోలీసులు సున్నితత్వాన్ని అలవర్చుకోవాలని చెప్పింది.

“బాధితులుగా, నిందితులుగా ఉన్నా, అరెస్టులు, దాడులు మరియు రెస్క్యూ ఆపరేషన్ల సమయంలో సెక్స్ వర్కర్ల గుర్తింపులను బహిర్గతం చేయకుండా మీడియా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, అటువంటి గుర్తింపులను బహిర్గతం చేసే ఏ ఫోటోను ప్రచురించకూడదు, ప్రసారం చేయకూడదని” కోర్టు పేర్కొంది.

వాళ్ళ గుర్తింపును బైటపెట్టే మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

Tags:    
Advertisement

Similar News