ఏపీలో మళ్లీ ఎన్నికల సందడి.. జూన్ 23న ఆత్మకూరు ఉప ఎన్నిక

ఏపీలోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి జూన్ 23న ఉప ఎన్నిక జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆత్మకూరుతో పాటు.. దేశవ్యాప్తంగా మొత్తం 10 స్థానాలకు ఉప ఎన్నికలు అదే రోజు జరగబోతున్నాయి. వీటిలో ఏడు అసెంబ్లీ స్థానాలు, మూడు లోక్ సభ స్థానాలున్నాయి. ఉప ఎన్నిక షెడ్యూల్.. నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల స్వీకరణ.. మే-30, 2022 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ జూన్-6, 2022 పోలింగ్ డేట్ 23-జూన్,2022 కౌంటింగ్, ఫలితాల ప్రకటన 26-జూన్, […]

Advertisement
Update:2022-05-25 15:44 IST

ఏపీలోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి జూన్ 23న ఉప ఎన్నిక జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆత్మకూరుతో పాటు.. దేశవ్యాప్తంగా మొత్తం 10 స్థానాలకు ఉప ఎన్నికలు అదే రోజు జరగబోతున్నాయి. వీటిలో ఏడు అసెంబ్లీ స్థానాలు, మూడు లోక్ సభ స్థానాలున్నాయి.

ఉప ఎన్నిక షెడ్యూల్..
నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల స్వీకరణ.. మే-30, 2022
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ జూన్-6, 2022
పోలింగ్ డేట్ 23-జూన్,2022
కౌంటింగ్, ఫలితాల ప్రకటన 26-జూన్, 2022

పంజాబ్ లోని సంగూర్ లోక్ సభ స్థానం, ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్, అజాంఘర్ లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇక అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే త్రిపురలో అగర్తల, బోర్డోవాలి, సుర్మ, జుబరజ్ నగర్ ప్రాంతాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయి. ఢిల్లీలోని రాజేందర్ నగర్, జార్ఖండ్ లోని మందర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతుంది. ఏపీ విషయానికొస్తే.. ఆత్మకూరులో బైపోల్ కి రంగం సిద్ధమైంది.

అధికార పార్టీనుంచి విక్రమ్ రెడ్డి..
ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యే, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. గౌతమ్ రెడ్డి వారసుడిగా ఇక్కడ ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డికి వైసీపీ టికెట్ కన్ఫామ్ చేసింది. అధికారిక ప్రకటన విడుదల చేయలేదు కానీ ఇప్పటికే ఆత్మకూరు వైసీపీ ఇన్ చార్జిగా విక్రమ్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. బీజేపీ తరపున బిజివేముల రవీంద్రనాథ్ రెడ్డి బరిలో దిగుతారనే ప్రచారం ఉంది. ఏపీలో ఇప్పుడు రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. దీంతో ఆత్మకూరు ఉప ఎన్నికపై ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో దృష్టిపెట్టే అవకాశముంది. ఇక్కడ బహుముఖ పోరుకి అవకాశం లేకపోలేదు.

Tags:    
Advertisement

Similar News