భారత్ లో రైల్వే ట్రాక్ లు పేల్చేందుకు ISI కుట్ర‌

భారత్ లో పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ (ISI) కుట్ర పన్నినట్టు భారత నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. దేశంలోని అనేక చోట్ల రైల్వే ట్రాక్ లను పేల్చి వేసేందుకు ఐ ఎస్ ఐ ప్రణాళికలు సిద్దం చేసిందని నిఘా వర్గాలు తెలిపాయి. పంజాబ్ దాని చుట్టు పక్కల రాష్ట్రాల్లోని రైల్వే ట్రాక్ లను ప్రధానంగా టార్గెట్ చేసుకున్నట్టు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హెచ్చరించాయి. ముఖ్యంగా సరుకు రవాణా చేసే రైళ్ళను లక్ష్యం చేసుకొని […]

Advertisement
Update:2022-05-23 05:00 IST

భారత్ లో పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ (ISI) కుట్ర పన్నినట్టు భారత నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. దేశంలోని అనేక చోట్ల రైల్వే ట్రాక్ లను పేల్చి వేసేందుకు ఐ ఎస్ ఐ ప్రణాళికలు సిద్దం చేసిందని నిఘా వర్గాలు తెలిపాయి.

పంజాబ్ దాని చుట్టు పక్కల రాష్ట్రాల్లోని రైల్వే ట్రాక్ లను ప్రధానంగా టార్గెట్ చేసుకున్నట్టు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హెచ్చరించాయి. ముఖ్యంగా సరుకు రవాణా చేసే రైళ్ళను లక్ష్యం చేసుకొని ఈ పేలుళ్ళు జరపాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

ఈ పేలుళ్ళ కోసం ఐ ఎస్ ఐ భారత్ లోని తన కార్యకర్తలకు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చినట్టు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తమ‌ అలర్ట్‌లో పేర్కొన్నాయి. భారత్ లో పాకిస్తాన్ కు చెందిన స్లీపర్ సెల్స్ కు ఇప్పటికే భారీ మొత్తంలో నిధులు అందాయని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై కేంద్రంతోపాటు అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హెచ్చరించాయి.

Tags:    
Advertisement

Similar News