ఇంట్లో తల్లీ, ఇద్దరు కూతుర్ల ఆత్మహత్య.. లైటర్, అగ్గిపుల్ల వెలిగిస్తే మీరూ చనిపోతారని హెచ్చరిక.. అసలేం జరిగింది?

కోవిడ్ కారణంగా ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నం అయ్యాయి. దాని కారణంగా ఇప్పటికీ కుంగిపోయి జీవితాలపై ఆశలు వదిలేసుకున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇంటి పెద్దలను కోల్పోయిన ఫ్యామిలీలు డిప్రెషన్‌లోకి పోయి అఘాత్యాలకు పాల్పడుతున్న సంఘటనలు కనపడుతూనే ఉన్నాయి. అలాంటి ఒక కుటుంబ విషాదాంతం ఢిల్లీలో చోటు చేసుకున్నది. ఢిల్లీలోని వసంత్‌విహార్‌లో నివసించే మంజు (54) అనే మహిళ తన ఇద్దరు కూతుర్లు అన్షిక (27), అంకూ (25) లతో కలసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం సృష్టించింది. […]

Advertisement
Update:2022-05-22 10:03 IST

కోవిడ్ కారణంగా ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నం అయ్యాయి. దాని కారణంగా ఇప్పటికీ కుంగిపోయి జీవితాలపై ఆశలు వదిలేసుకున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇంటి పెద్దలను కోల్పోయిన ఫ్యామిలీలు డిప్రెషన్‌లోకి పోయి అఘాత్యాలకు పాల్పడుతున్న సంఘటనలు కనపడుతూనే ఉన్నాయి. అలాంటి ఒక కుటుంబ విషాదాంతం ఢిల్లీలో చోటు చేసుకున్నది. ఢిల్లీలోని వసంత్‌విహార్‌లో నివసించే మంజు (54) అనే మహిళ తన ఇద్దరు కూతుర్లు అన్షిక (27), అంకూ (25) లతో కలసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం సృష్టించింది.

స్థానికుల వివరాల ప్రకారం.. మంజు తన ఇద్దరు కూతుర్లతో కలసి వసంత్ విహార్‌లో నివసిస్తోంది. నిరుడు మంజూ భర్త కోవిడ్ కారణంగా చనిపోయాడు. దీంతో అప్పటి నుంచి తల్లీకూతుర్లు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. శనివారం సాయంత్రం వరకు కనపడిన వీళ్లు.. ఆదివారం తలుపులు తీయకుండా ఉండటంతో స్థానికులకు అనుమానం వచ్చింది.

దీంతో వెంటనే వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లి చూడగా బెడ్ రూంలో ముగ్గురు చనిపోయి ఉన్నారు. అంతే కాకుండా ఇంటినే గ్యాస్ ఛాంబర్ లాగా మార్చి చనిపోయినట్లు గుర్తించారు. ఇంటిలోని కిటికీలు, వెంటిలేటర్లకు పాలథిన్ కవర్లు అంటించి విషవాయువును వదిలిపెట్టారు. దీంతో ఊపిరాడక ముగ్గురు ప్రాణాలు వదిలారు.

కాగా, వారి మృతదేహాల పక్కనే ఒక సూసైడ్ నోట్ లభించింది. ఇంటిలో పూర్తిగా కార్బన్ మోనాక్సైడ్‌తో నిండి ఉన్నది. ఎవరైనా లైటర్, అగ్గిపెట్టె వెలిగిస్తే ఇల్లంతా తగలబడిపోతుంది. అంతే కాకుండా ఈ గాలిని ఎక్కువ సేపు పీల్చినా చనిపోతారు. కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరిక ఉండటం గమనార్హం.

ఇంటి పెద్ద చనిపోయిన దగ్గర నుంచి ముగ్గురు కూడా చాలా ముభావంగా ఉంటున్నారని, ఎవరితోనూ సరిగా మాట్లాడటం లేదని ఇరుగు పొరుగు వాళ్లు చెప్పారు. అంతే కాకుండా మంజు ఆరోగ్యం కూడా ఇటీవల చాలా వరకు క్షీణించిందని.. తను చనిపోతే పిల్లలు పూర్తిగా అనాధలు అవుతారనే ఆందోళన కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ కారణాలే వారిని సూసైడ్ చేసుకోవడానికి పురికొల్పి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మూడు మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News