బస్సుయాత్రపై జేసీ వివాదాస్పద వ్యాఖ్యలు

తెలుగురాష్ట్రాల్లో పొలిటికల్ కాంట్రవర్సికి కేరాఫ్ గా నిలుస్తుంటారు జేసీ బ్రదర్స్.. ( జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి) ఒకరిని మించి సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. సొంతపార్టీపైన వ్యాఖ్యానాలు చేసేందుకు కూడా వెనకాడరు. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా గడపగడపకు మన ప్రభుత్వం పేరిట ప్రజల్లోకి వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ […]

Advertisement
Update:2022-05-22 08:40 IST

తెలుగురాష్ట్రాల్లో పొలిటికల్ కాంట్రవర్సికి కేరాఫ్ గా నిలుస్తుంటారు జేసీ బ్రదర్స్.. ( జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి) ఒకరిని మించి సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. సొంతపార్టీపైన వ్యాఖ్యానాలు చేసేందుకు కూడా వెనకాడరు. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా గడపగడపకు మన ప్రభుత్వం పేరిట ప్రజల్లోకి వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు చురుగ్గా పాల్గొంటున్నారు.

ఈ కార్యక్రమం కొనసాగుతుండగానే.. ‘సామాజిక న్యాయభేరి’ పేరుతో మంత్రులు బస్సు యాత్ర చేపడుతున్నారు. ఈనెల 26న శ్రీకాకుళంలో బస్సు యాత్ర ప్రారంభమై 29వ తేదీన అనంతపురంలో ముగుస్తుంది. యాత్రలో భాగంగా ప్రతి రోజు ఓ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ యాత్రపై జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
బస్సు యాత్రపై రాళ్లదాడి జరిగే అవకాశం ఉందని.. పోలీసులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

కొందరు వైసీపీ నేతలు ఆయన వ్యాఖ్యలను ఫన్నీగానే తీసుకున్నప్పటికీ .. మరికొందరు మాత్రం సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బస్సు యాత్ర జరుగుతున్న క్రమంలో టీడీపీ శ్రేణులు కుట్రకు తెరలేపాయేమోనని వారు అనుమానిస్తున్నారు. బస్సు యాత్రలపై టీడీపీ శ్రేణులు ఉద్దేశ్యపూర్వకంగా దాడులు చేసే అవకాశం ఉందేమోనని వారు భావిస్తున్నారు. ఇటీవల చంద్రబాబు వ్యాఖ్యలు కూడా ఇందుకు ఆజ్యం పోస్తున్నాయి. రాయలసీమలోని పలు జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబు టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. తాజాగా జేసీ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ALSO READ: స్పీకర్‌పై టీడీపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు

Tags:    
Advertisement

Similar News