కేజ్రీవాల్ తో కేసీఆర్ కీలక సమావేశం

దేశ పర్యటన‌ చేస్తున్న కేసీఆర్ ఈ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ తో సమావేశమయ్యారు. కేజ్రీవాల్ ఇంట్లో జరిగిన ఈ విందు సమావేశంలో వీళ్ళిద్దరూ దేశరాజకీయాలపై చర్చలు జరిపారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలను బలహీనపర్చే విధంగా వ్యవహరించడం, ఫెడరల్ స్పూర్తికి విరుద్దంగా నిర్ణయాలుండటం తదితర విషయాలపై చర్చలు జరిపారు. రాష్ట్రాల అభివృద్ది జరగకుండా దేశాభివృద్ది అసాధ్యమని ఇద్దరు నాయకులు అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. అదే విధంగా దేశంలో బీజేపీ, కాంగ్రెస్ […]

Advertisement
Update:2022-05-22 09:05 IST

దేశ పర్యటన‌ చేస్తున్న కేసీఆర్ ఈ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ తో సమావేశమయ్యారు. కేజ్రీవాల్ ఇంట్లో జరిగిన ఈ విందు సమావేశంలో వీళ్ళిద్దరూ దేశరాజకీయాలపై చర్చలు జరిపారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలను బలహీనపర్చే విధంగా వ్యవహరించడం, ఫెడరల్ స్పూర్తికి విరుద్దంగా నిర్ణయాలుండటం తదితర విషయాలపై చర్చలు జరిపారు. రాష్ట్రాల అభివృద్ది జరగకుండా దేశాభివృద్ది అసాధ్యమని ఇద్దరు నాయకులు అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. అదే విధంగా దేశంలో బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా ఒక కూటమి ఏర్పడాల్సిన అవసరం ఉందని ఇద్దరు ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డట్టు తెలిసింది.

ఈ సమావేశం తర్వాత ముఖ్యమంత్రులిద్దరూ చండీగ‌డ్ వెళ్ళనున్నారు. సంవత్సరం పాటు జరిగిన రైతు ఉద్యమంలో మరణించిన రైతుల కుటుంబాలను కేసీఆర్, కేజ్రీవాల్ పరామర్షించనున్నారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ కూడా పాల్గొననున్నారు. అనంతరం కేసీఆర్ అమర రైతుల ఒక్కో కుటుంబానికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయనున్నారు. అదేవిధంగా గాల్వాన్ లోయలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణల్లో అమరులైన జవాన్ల కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం అందిస్తారు. ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వనున్నారు

ALSO READ: పంచాయతీలకే నిధులు సరిపోవట్లేదు.. ఇప్పుడు ఎంపీడీవో వాహనాల మెయింటెనెన్స్ ఖర్చుల భారం..!

Tags:    
Advertisement

Similar News