ముస్లిం అనే అనుమానంతో మానసిక వికలాంగుడిని కొట్టి చంపిన బీజేపీ నేత‌

మధ్యప్రదేశ్‌లో మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న 65 ఏళ్ల వ్యక్తి ని ముస్లిం అనే అనుమానించిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్త కొట్టి చంపాడు. పోలీసుల కథనం ప్రకారం భవర్‌లాల్ జైన్ ఎంపీ రత్లాం జిల్లాలోని జారా తహసీల్‌లోని సర్సీ గ్రామానికి చెందినవాడు. మే 15న రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ జిల్లాలో జరిగిన ఓ పెళ్లికి వెళ్లి కనిపించకుండా పోయాడు. మే 19న మానస పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపుర రోడ్డు సమీపంలో శవమై కనిపించాడు. అయితే ఆ […]

Advertisement
Update:2022-05-21 11:10 IST

మధ్యప్రదేశ్‌లో మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న 65 ఏళ్ల వ్యక్తి ని ముస్లిం అనే అనుమానించిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్త కొట్టి చంపాడు.

పోలీసుల కథనం ప్రకారం భవర్‌లాల్ జైన్ ఎంపీ రత్లాం జిల్లాలోని జారా తహసీల్‌లోని సర్సీ గ్రామానికి చెందినవాడు. మే 15న రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ జిల్లాలో జరిగిన ఓ పెళ్లికి వెళ్లి కనిపించకుండా పోయాడు. మే 19న మానస పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపుర రోడ్డు సమీపంలో శవమై కనిపించాడు.

అయితే ఆ మానసిక వికలాంగుడైన వృద్దుడిని నీముచ్‌కి చెందిన బీజేపీ స్థానిక నాయకుడు దినేష్ కుష్వాహ కొట్టి చంపాడు. అతన్ని ముస్లిం అనుకొని కొట్టి చంపినట్టు ఓ వీడియోలో బహిర్గతమైంది.

ముందుగా జైన్ మృతదేహాన్ని గుర్తు తెలియని శవంగా ప్రకటించిన పోలీసులు సమీపంలోని పోలీసు స్టేషన్లలో సందేశాలను పంపించారు. సాయంత్రానికి, రత్లామ్‌కు చెందిన ఒక జైన కుటుంబం మృతదేహాన్ని గుర్తుపట్టింది. అతను గత నాలుగు రోజులుగా తప్పిపోయిన మానసిక వికలాంగుడైన భవర్‌లాల్ జైన్‌గా గుర్తించాడు, ”అని నీముచ్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సూరజ్ కుమార్ తెలిపారు.
పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. అయితే అతని మృతికి గల కారణాలు తెలియరాలేదని ఎస్పీ తెలిపారు.

అదే సమయంలో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది, దీనిలో స్థానిక బిజెపి నాయకుడు దినేష్ కుష్వాహా వృద్దుడైన జైన్‌పై దాడి చేయడం, అతని పేరు మరియు అతని ఆధార్ కార్డ్ చూపించమని అడగడం కనిపించింది..

“మీ పేరు ఏమిటి? మహమ్మదా? నీ ఆధార్ కార్డ్ చూపించు” అని ఖుష్వా అంటున్నట్లు వినిపిస్తోంది.

నిమిషం నిడివిగల వీడియోలో, కుష్వాహా, జైన్‌ను ఎడతెగకుండా కొట్టడం కనిపిస్తుంది. మరుసటి రోజు ఉదయం జైన్ శవమై కనిపించాడు.

నీముచ్‌లోని ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ జైన్ బహుశా తన స్వస్థలమైన సర్సీ గ్రామానికి చేరుకోవడానికి ప్రయత్నించాడని, అయితే నీముచ్‌లోని మానస ప్రాంతంలో కూడా అదే పేరుతో మరో గ్రామం ఉంది. అందువల్ల, ఆ వృద్దుడు మానసకు చేరుకొని ఉంటాడు అని చెప్పాడు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో జైన్ కుటుంబానికి చేరడంతో, అతని సోదరుడు రాకేష్ జైన్ కుష్వాహపై ఫిర్యాదు చేశాడు. దాంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు మానస పోలీస్ స్టేషన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ డాంగి తెలిపారు. “భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 , 304 (2) కింద కుష్వాహా, అతని గుర్తుతెలియని సహచరుడిపై కేసు నమోదు చేశాము. వారిని అరెస్టు చేయడానికి బృందాలు ఏర్పాటు చేశాము” అని డాంగి చెప్పారు.
ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

నిందితుడు కుష్వాహ మాజీ బిజెపి కార్పొరేటర్ భర్త అని పోలీసులు తెలిపారు.

బీజేపీతో ఖుష్వాహకు ఉన్న అనుబంధాన్ని ఆ పార్టీ నీముచ్ జిల్లా అధ్యక్షుడు పవన్ పాటిదార్ దృవీకరించారు.
అయితే, ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత కుష్వాహాను పార్టీ నుంచి సస్పెండ్ చేశారా అని అడిగినప్పుడు అతను కాల్‌ను డిస్‌కనెక్ట్ చేశాడు.

ALSO READ: రైలు టిక్కట్లపై ఇక మీద‌ సీనియర్ సిటిజన్లకు రాయితీ లేదు

Tags:    
Advertisement

Similar News