శ్రీకృష్ణ జన్మస్థానం కేసు- అనుమతించిన కోర్టు

మరో మత వివాదం దేశం తెరపైకి వచ్చింది. ఒక వైపు జ్ఞానవాపి మసీదు వివాదం కొనసాగుతుండగానే హిందూ సంస్థలు ఎప్పటి నుండో వివాదాస్పదంగా మార్చిన శ్రీకృష్ణ జన్మస్థానం సమస్యను మళ్ళీ తెరపైకి తెచ్చాయి. దీనికి సంబంధించి దాఖలైన పిటిషన్ ను ఈ రోజు మధుర కోర్టు అనుమతించింది. మధురలో ఉన్న షాహీ ఈద్గా శ్రీకృష్ణ జన్మ స్థానమని హిందూ సంఘాలూ చాలా కాలంగా వాదిస్తున్నాయి. అయోద్య రామమందిరం తీర్పు తర్వాత ఈ వాదనలు శృతి మించాయి కూడా. […]

Advertisement
Update:2022-05-19 10:32 IST

మరో మత వివాదం దేశం తెరపైకి వచ్చింది. ఒక వైపు జ్ఞానవాపి మసీదు వివాదం కొనసాగుతుండగానే హిందూ సంస్థలు ఎప్పటి నుండో వివాదాస్పదంగా మార్చిన శ్రీకృష్ణ జన్మస్థానం సమస్యను మళ్ళీ తెరపైకి తెచ్చాయి. దీనికి సంబంధించి దాఖలైన పిటిషన్ ను ఈ రోజు మధుర కోర్టు అనుమతించింది.

మధురలో ఉన్న షాహీ ఈద్గా శ్రీకృష్ణ జన్మ స్థానమని హిందూ సంఘాలూ చాలా కాలంగా వాదిస్తున్నాయి. అయోద్య రామమందిరం తీర్పు తర్వాత ఈ వాదనలు శృతి మించాయి కూడా. ఎప్పటికైనా మధురలోని శ్రీకృష్ణ జన్మ స్థానాన్ని సాధించి తీరుతామని గతంలో అనేక మంది బీజేపీ నాయకులు కూడా ప్రకటనలు గుప్పించారు.

కాగా, షాహీ ఈద్గాను తొలగించాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఈ రోజు మధుర కోర్టు అనుమతించింది.

శ్రీకృష్ణ జన్మభూమి-షాహి ఈద్గా మసీదు వివాదం కేసులో పిటిషనర్లు శ్రీకృష్ణ జన్మభూమికి చెందిన 13.37 ఎకరాల భూమికి హిందూ సంస్థలకు యాజమాన్యపు హక్కులు ఇవ్వాలని, అక్కడ నిర్మించిన షాహీ ఈద్గా మసీదును కూడా తొలగించాలని కోరుతున్నారు.

న్యాయస్థానం ముందు దాఖలు చేసిన పలు పిటిషన్లలో ఒకదానిలో, పిటిషనర్లు ట్రస్ట్ భూమిలో నిర్మించిన ఈద్గాను చట్టవిరుద్ధమని పేర్కొంటూ దానిని కూల్చివేసి, మొత్తం భూమిని డి-ఫాక్టో యజమాని శ్రీ కృష్ణ విరాజ్‌మాన్‌కు అప్పగించాలని కోర్టును అభ్యర్థించారు.

కోర్టు పర్యవేక్షణలో వివాదాస్పద స్థలంలో తవ్వకాలు జరపాలని, తవ్వకానికి సంబంధించిన విచారణ నివేదికను సమర్పించాలని పిటిషన్‌లో కోరారు.

Tags:    
Advertisement

Similar News