దేశంలోనే తొలిసారిగా పశువులకోసం ఏపీలో అంబులెన్స్‌లు

పశువులకోసం ప్రభుత్వం ఆస్పత్రులు నిర్వహించడం తెలిసిందే. అయితే తొలిసారిగా పశువుల సంరక్షణ కోసం ఏపీ ప్రభుత్వం అంబులెన్స్ ల సౌకర్యం తీసుకొచ్చింది. తొలి దశలో రూ.143 కోట్ల ఖర్చుతో 175 అంబులెన్స్ లను సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. మొత్తం రూ.278 కోట్లతో 340 పశువుల అంబులెన్స్ లను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం, అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవల పేరిట ఈ అంబులెన్స్ లు అందుబాటులోకి తెచ్చారు. దేశంలోనే […]

Advertisement
Update:2022-05-19 09:08 IST

పశువులకోసం ప్రభుత్వం ఆస్పత్రులు నిర్వహించడం తెలిసిందే. అయితే తొలిసారిగా పశువుల సంరక్షణ కోసం ఏపీ ప్రభుత్వం అంబులెన్స్ ల సౌకర్యం తీసుకొచ్చింది. తొలి దశలో రూ.143 కోట్ల ఖర్చుతో 175 అంబులెన్స్ లను సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. మొత్తం రూ.278 కోట్లతో 340 పశువుల అంబులెన్స్ లను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం, అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవల పేరిట ఈ అంబులెన్స్ లు అందుబాటులోకి తెచ్చారు.

దేశంలోనే ఇది ఓ వినూత్న పథకం. ప్రస్తుతం ఏపీలో తప్ప ఇంకెక్కడా ఇలాంటి వైద్య సేవలు అందుబాటులో లేవు. అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు చొప్పున 108 అంబులెన్స్ ల తరహాలోనే.. అత్యాధునిక సౌకర్యాలతో వీటి సేవలు అందుబాటులో ఉంటాయి. దీనికోసం 1962 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. నిర్వహణ ఖర్చులన్నీ పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది.

ఫోన్ చేస్తే చాలు వచ్చేస్తారు..
ప్రస్తుతం 108కి ఫోన్ చేసిన వెంటనే బాధితుల వద్దకు నేరుగా అంబులెన్స్ వస్తుంది. అదే తరహాలో పశువు అనారోగ్య సమస్యని వివరిస్తూ ఫోన్ చేసిన వెంటనే పశువుల అంబులెన్స్ రైతుల ఇంటి వద్దకే వస్తుంది. అవసరమైన ప్రాథమిక చికిత్స చేసి వైద్య సేవలు అందిస్తారు. ఒకవేళ ఆస్పత్రికి తీసుకెళ్లడం తప్పనిసరి అయితే.. దగ్గరలోని ఏరియా పశువైద్యశాలకు లేదా వెటర్నరీ పాలీక్లినిక్‌ కు అంబులెన్స్ లో తరలిస్తారు. చికిత్స తర్వాత పశువును సురక్షితంగా రైతు ఇంటికి ఉచితంగా చేరుస్తారు.

అంబులెన్స్‌ లో సౌకర్యాలివీ..
– అంబులెన్స్ లో ఒక వెటర్నరీ డాక్టర్ ఉంటారు. వెటర్నరీ కోర్సులో డిప్లొమా చేసిన సహాయకుడు, డ్రైవర్‌ కమ్‌ అటెండర్‌ ఉంటారు.
– 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్తపరీక్షలు చేసేందుకు మైక్రోస్కోప్‌ తో కూడిన చిన్న ప్రయోగశాల అందుబాటులో ఉంటుంది.
– పశువులకు సంబంధించిన అన్ని రకాల వ్యాక్సిన్లు, మందులతోపాటు పశువును వాహనంలోకి ఎక్కించేందుకు హైడ్రాలిక్‌ యంత్రం ఉంటుంది.
– పెంపుడు జంతువులు, పక్షులకు సర్జరీలు చేసేందుకు ఏర్పాట్లు కూడా ఉంటాయి.

Tags:    
Advertisement

Similar News