రాపాక వరప్రసాద్‌ పై జెడ్పీటీసీ ఆరోపణలు.. కూతురుగా భావించానన్న ఎమ్మెల్యే

జనసేన తరపున గెలిచి వైసీపీకి అనుబంధం ఉంటున్న రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు, స్థానిక వైసీపీ నేతలకు అంతగా పొసగడం లేదు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే రాపాక తనను అవమానించారంటూ వైసీపీ మలికిపురం జెడ్పీటీసీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తనను ఏకవచనంతో ఎమ్మెల్యే మాట్లాడారని… నీది ఏ పార్టీ అంటూ తనను ప్రశ్నించారని జెడ్పీటీసీ ప్రసన్నకుమారి చెబుతున్నారు. నీవు రాజకీయాలకు పనికి రావాలంటూ వందల మంది సమక్షంలో అవమానించారని ఆమె ఆరోపిస్తున్నారు. […]

Advertisement
Update:2022-05-18 12:44 IST

జనసేన తరపున గెలిచి వైసీపీకి అనుబంధం ఉంటున్న రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు, స్థానిక వైసీపీ నేతలకు అంతగా పొసగడం లేదు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే రాపాక తనను అవమానించారంటూ వైసీపీ మలికిపురం జెడ్పీటీసీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తనను ఏకవచనంతో ఎమ్మెల్యే మాట్లాడారని… నీది ఏ పార్టీ అంటూ తనను ప్రశ్నించారని జెడ్పీటీసీ ప్రసన్నకుమారి చెబుతున్నారు. నీవు రాజకీయాలకు పనికి రావాలంటూ వందల మంది సమక్షంలో అవమానించారని ఆమె ఆరోపిస్తున్నారు.

తనను ఏ పార్టీ అని అడుగుతున్న ఎమ్మెల్యే.. ఏ పార్టీ తరపున గెలిచి ఏపార్టీ పక్షానికి వచ్చారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. తాను వైసీపీ గుర్తుపై గెలిచానే గానీ… మరో పార్టీలో గెలిచి ఈ పార్టీలోకి రాలేదన్నారు. ఎమ్మెల్యే రాపాక తీరుపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తానన్నారు.

జెడ్పీటీసీ ప్రసన్నకుమారి ఆరోపణలపై ఎమ్మెల్యే రాపాక వివరణ ఇచ్చారు. మలికిపురం జెడ్పీటీసీ ప్రసన్నకుమారిని తాను కూతురులా భావిస్తానని అందుకే ఏక వచనంతో మాట్లాడానన్నారు. మండల కమిటీ ఎన్నికలకు ప్రసన్న హాజరు కాలేదని… ఆ విషయాన్నే తాను సాధారణంగా ప్రశ్నించానన్నారు. ఒకవేళ ఏకవచనంతో పిలవడం పట్ల ప్రసన్న బాధపడి ఉంటే క్షమాపణ చెబుతున్నానని ఎమ్మెల్యే రాపాక చెప్పారు. ఇకపై ఆమెను మీరు అనే సంబోధిస్తానని వివరణ ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News