సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిని విడుదల చేయాలని ఆదేశం

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి అయిన ఏజీ పేరారివాలన్ ను విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. రాజ్యాంగంలోని 142వ అధికరణం ప్రకారం విడుదలకు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ బిఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం పేర్కొంది. 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌లో రాజీవ్‌గాంధీ హత్య జరిగింది. 1991 జూన్‌ 11న చెన్నైలో పెరరివలన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాజీవ్ గాంధీ హత్యకు వాడిన పేలుడు […]

Advertisement
Update:2022-05-18 10:28 IST

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి అయిన ఏజీ పేరారివాలన్ ను విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. రాజ్యాంగంలోని 142వ అధికరణం ప్రకారం విడుదలకు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ బిఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం పేర్కొంది.

1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌లో రాజీవ్‌గాంధీ హత్య జరిగింది. 1991 జూన్‌ 11న చెన్నైలో పెరరివలన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాజీవ్ గాంధీ హత్యకు వాడిన పేలుడు పదార్థాలను పేరారివాలన్ సరఫరా చేశారనే కారణంతో అతనికి ఉరి శిక్షపడింది. 2014లో సుప్రీం కోర్టు అతని మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చింది. 31 ఏళ్ళుగా ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

కాగా 2015లో పేరారివాలన్ గవర్నర్ కు క్షమాబిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. అప్పటి నుండి అది పెండింగ్ లో ఉన్నది. అయితే ఆ పిటిషన్ ను రాష్ట్రపతికి ప‍ంపాలన్న గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ బద్దం కాదని ఈ రోజు సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొంది.

ALSO READ: జ్ఞాన్‌వాపి మసీదు కేసులో ‘మీడియా లీక్స్’ సర్వే కమిషన్ హెడ్‌ని తొలగించిన కోర్టు

Tags:    
Advertisement

Similar News