నేరస్తులనే కాదు, ఒత్తిడిని కూడా చిత్తు చేయాల్సిందే

ఉద్యోగమంటే నిత్యం నేరాలు, ఘోరాలు, నేరస్తులు, బందోబస్తులు.. ఇలా కాస్త కఠినంగానే ఉంటుంది. పని వేళలు, ఆహార వేళలు.. అన్నీ సమయానుకూలంగా మారిపోతాయి కాబట్టి.. అనారోగ్య సమస్యలు కూడా వారికి అధికం. సున్నిత మనస్కులు నిత్యం మనస్సులో సంఘర్షణ పడుతూనే ఉంటారు. ఇలాంటివారందరికీ కౌన్సెలింగ్ సెషన్లు ఏర్పాటు చేస్తున్నారు ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు. ఐపీఎస్ స్థాయినుంచి కానిస్టేబుల్ స్థాయి వరకు అందరికీ కౌన్సెలింగ్ సెషన్లు అందుబాటులోకి తెస్తున్నారు. పేరున్న సైకియార్టిస్ట్ లతో వారికి ప్రత్యేక కౌన్సెలింగ్ ఇచ్చేందుకు […]

Advertisement
Update:2022-05-16 12:30 IST

ఉద్యోగమంటే నిత్యం నేరాలు, ఘోరాలు, నేరస్తులు, బందోబస్తులు.. ఇలా కాస్త కఠినంగానే ఉంటుంది. పని వేళలు, ఆహార వేళలు.. అన్నీ సమయానుకూలంగా మారిపోతాయి కాబట్టి.. అనారోగ్య సమస్యలు కూడా వారికి అధికం. సున్నిత మనస్కులు నిత్యం మనస్సులో సంఘర్షణ పడుతూనే ఉంటారు. ఇలాంటివారందరికీ కౌన్సెలింగ్ సెషన్లు ఏర్పాటు చేస్తున్నారు ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు. ఐపీఎస్ స్థాయినుంచి కానిస్టేబుల్ స్థాయి వరకు అందరికీ కౌన్సెలింగ్ సెషన్లు అందుబాటులోకి తెస్తున్నారు. పేరున్న సైకియార్టిస్ట్ లతో వారికి ప్రత్యేక కౌన్సెలింగ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

ఇటీవల కాకినాడ జిల్లా సర్పవరం ఎస్సై గోపాలకృష్ణ సూసైడ్ వ్యవహారం సంచలనంగా మారింది. తన చదువుకి తగ్గ పోస్ట్ లో లేనని, నిత్యం మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తోందని ఆయన రాసిన సూసైడ్ లెటర్ కలకలం రేపింది. ప్రభుత్వ ఉద్యోగం చాలామందికి ఓ కల, అందులోనూ ఎస్సై స్థాయి ర్యాంక్ ఉన్న గోపాలకృష్ణ అర్థాంతరంగా తనువు చాలించటం అందరినీ కలచి వేసింది. దీంతో పోలీసుల మానసిక ఒత్తిడిపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో పోలీసులకు ఈరోజునుంచి కౌన్సెలింగ్ సెషన్లు మొదలయ్యాయి.

ఒత్తిడి లేనప్పుడే పోలీసులు తమ విధులను మరింత సమర్థంగా నిర్వర్తించగలరు అని చెబుతున్నారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. కొంతమంది విధులను పూర్తి చేసి ఇంటికెళ్లే క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని ఆయన చెప్పారు. అలాంటి వారందరికీ ఈ సెషన్లు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ముఖ్యంగా వీఐపీ బందోబస్తు, లా అండ్ ఆర్డర్, కోర్ట్ డ్యూటీ, ట్రాఫిక్ డ్యూటీ, కూంబింగ్ ఆపరేషన్లు చేసే వారికి ఇలాంటి కౌన్సెలింగ్ లు అవసరం అని చెబుతున్నారాయన. యోగా, ప్రాణాయామంపై కూడా పోలీసులకు శిక్షణ ఇప్పిస్తామని చెబుతున్నారు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.

Tags:    
Advertisement

Similar News