మీ నాయకులే మాతో టచ్ లో ఉన్నారు పప్పూ..

టీడీపీ నాయకులు రాత్రుళ్లు.. వైసీపీ ఎమ్మెల్యేలతో టచ్ లో ఉంటారని, లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటారని.. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో ఓ వైసీపీ అభ్యర్థికి టీడీపీ కీలక నేత ఆర్థిక సహకారం అందించారని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. అలాంటి వారి గురించి సమాచారం ఇస్తే లోకేష్ వారిని పార్టీనుంచి సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు. ఆ దమ్ము లోకేష్ కి ఉంటే.. తాను కచ్చితంగా సమాచాచరం ఇస్తానని చెప్పారాయన. నెల్లూరు జిల్లాలో […]

Advertisement
Update:2022-05-16 17:32 IST

టీడీపీ నాయకులు రాత్రుళ్లు.. వైసీపీ ఎమ్మెల్యేలతో టచ్ లో ఉంటారని, లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటారని.. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో ఓ వైసీపీ అభ్యర్థికి టీడీపీ కీలక నేత ఆర్థిక సహకారం అందించారని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. అలాంటి వారి గురించి సమాచారం ఇస్తే లోకేష్ వారిని పార్టీనుంచి సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు. ఆ దమ్ము లోకేష్ కి ఉంటే.. తాను కచ్చితంగా సమాచాచరం ఇస్తానని చెప్పారాయన.

నెల్లూరు జిల్లాలో రాజకీయాలకోసం తన ఆస్తులు అమ్ముకున్నానని, మంత్రి పదవిలో ఉన్నా కూడా ఒక్క రూపాయి అవినీతికి పాల్పడలేదని అన్నారు అనిల్ కుమార్ యాదవ్. అక్రమ లే అవుట్ల విషయంలో ఇటీవల తనపై వచ్చిన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. తనకు ఎవరెవరో బినామీలు ఉన్నారంటూ నారా లోకేష్ అపనిందలు వేస్తున్నారని, అసలు బినామీ ఆయనేనంటూ విమర్శించారు. అక్రమ లే అవుట్ల రిజిస్ట్రేషన్లను తమ ప్రభుత్వం ఆపివేసిందని గుర్తు చేశారు అనిల్.

మాసిన గడ్డంతో నారా లోకేష్ బిల్డప్ ఇస్తున్నారని, తనపై తప్పుడు ఆరోపణలు చేసినవారంతా నాశనమైపోతారని, ఆల్రడీ టీడీపీ నాశనమైపోయిందని.. అంతకంటే జరిగేదేమీ లేదని చెప్పారు. వచ్చే దఫా తిరిగి అధికారంలోకి వచ్చి, మరోసారి మంత్రి పదవి చేపడతానంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోనన్నారు అనిల్ కుమార్ యాదవ్. టీడీపీలో ఉన్న కీలక నేతలే కోవర్టులుగా ఉన్నారని, వారంతా వైసీపీ నేతలతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటున్నారను, ముందు టీడీపీలో ఉన్న వ్యవహారాలపై లోకేష్ దృష్టి పెట్టాలని హితవు పలికారు అనిల్. తప్పుడు ఆరోపణలు చేసి పప్పు అని మరోసారి నిరూపించుకున్నారంటూ ధ్వజమెత్తారు.

Tags:    
Advertisement

Similar News