కాశ్మీర్ టు కన్యాకుమారి.. భారత్ జోడో యాత్రకు కాంగ్రెస్ సిద్ధం..

కేంద్రంలో అధికారం చేపట్టాలంటే, రాష్ట్రాల్లో తిరిగి తమ ఉనికి చాటుకోవాలంటే.. ప్రజలకు దగ్గర కావాలని, నాయకులు జనాల్లోకి వెళ్లాలని తీర్మానించింది కాంగ్రెస్ పార్టీ. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర మొదలు పెట్టాలని నిర్ణయించింది. అక్టోబర్-2న ఈ యాత్రకు మూహూర్తం ఖరారు చేసింది. ఉదయ్ పూర్ వేదికగా జరిగిన చింతన్ శిబిర్ లో భారత్ జోడో యాత్ర సహా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం. ఇటీవల తెలంగాణ పర్యటనలో కూడా రాహుల్ […]

Advertisement
Update:2022-05-15 14:12 IST

కేంద్రంలో అధికారం చేపట్టాలంటే, రాష్ట్రాల్లో తిరిగి తమ ఉనికి చాటుకోవాలంటే.. ప్రజలకు దగ్గర కావాలని, నాయకులు జనాల్లోకి వెళ్లాలని తీర్మానించింది కాంగ్రెస్ పార్టీ. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర మొదలు పెట్టాలని నిర్ణయించింది. అక్టోబర్-2న ఈ యాత్రకు మూహూర్తం ఖరారు చేసింది. ఉదయ్ పూర్ వేదికగా జరిగిన చింతన్ శిబిర్ లో భారత్ జోడో యాత్ర సహా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం. ఇటీవల తెలంగాణ పర్యటనలో కూడా రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకులకు ఇలాంటి సూచనలే ఇచ్చారు. “ఢిల్లీ రావొద్దు, హైదరాబాద్ లో కూర్చోవద్దు.. నియోజకవర్గాల్లో తిరగండి, జనంలో కలవండి” అంటూ ఆయన నాయకులకు సూచించారు.

2014నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ కి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. వరుసగా రెండుసార్లు కేంద్రంలో అధికారం కోల్పోయింది, క్రమక్రమంగా లోక్ సభ, రాజ్యసభలో కూడా బలం తగ్గిపోతోంది. అటు పంజాబ్ లాంటి కీలక రాష్ట్రాలను కూడా కోల్పోవాల్సిన దుస్థితి. ఈ దశలో కాంగ్రెస్ ప్రక్షాళణ కోసం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఓ ఫార్ములా రూపొందించారు. అంతకంటే ముందే కాంగ్రెస్ అసమ్మతి వర్గం కూడా అధిష్టానానికి ప్రక్షాళణ ఫార్మూలా సూచించింది. వీటన్నిటినీ వడపోసి, కమిటీల నివేదికలు పరిశీలించి సోనియా గాంధీ తుది నిర్ణయం తీసుకున్నారు. ఉదయ్ పూర్ లో మూడు రోజుల పాటు జరిగిన చింతన్ శిబిర్ లో వీటికి ఆమోద ముద్ర వేశారు.

ఒక కుటుంబానికి ఒక టిక్కెట్, 50 ఏళ్ల లోపు నాయకులకు 50 శాతం పార్టీలో సంస్థాగత పదవులు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం పార్టీ పదవులు.. వంటి కీలక నిర్ణయాలతోపాటు.. భారత్ జోడో యాత్రకు సోనియాగాంధీ ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ పాదయాత్రలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. ప్రతి రాష్ట్రంలో ఆయన సుమారు 90కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఆయన వెంట ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులు పాల్గొంటారు. ‘నవ సంకల్ప చింతన శిబిరం’లో తీసుకున్న నిర్ణయాలతో కాంగ్రెస్ కి జవసత్వాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు సోనియా గాంధీ.

Tags:    
Advertisement

Similar News