నాకు ఇంట్రెస్ట్ లేదు.. ప్లీజ్ తప్పుడు ప్రచారం ఆపండి: ఆదానీ
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదానీ కుటుంబసభ్యులకు త్వరలో రాజ్యసభ సీటు ఖారారు కానున్నదని వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆదానీ క్లారిటీ ఇచ్చారు. ‘ నాకు రాజకీయాల్లోకి వెళ్లాలని ఆసక్తి లేదు. నా కుటుంబసభ్యులకు కూడా ఇంట్రెస్ట్ లేదు. దయచేసి ఈ ప్రచారం ఆపండి’ అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. దీంతో ఆదానీకి లేదా ఆయన కుటుంబసభ్యలకు .. సీఎం జగన్ ఎంపీ పదవి కట్టబెట్టబోతున్నారన్న విమర్శలకు చెక్ పడింది. అయితే ఈ సారి […]
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదానీ కుటుంబసభ్యులకు త్వరలో రాజ్యసభ సీటు ఖారారు కానున్నదని వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆదానీ క్లారిటీ ఇచ్చారు. ‘ నాకు రాజకీయాల్లోకి వెళ్లాలని ఆసక్తి లేదు. నా కుటుంబసభ్యులకు కూడా ఇంట్రెస్ట్ లేదు. దయచేసి ఈ ప్రచారం ఆపండి’ అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. దీంతో ఆదానీకి లేదా ఆయన కుటుంబసభ్యలకు .. సీఎం జగన్ ఎంపీ పదవి కట్టబెట్టబోతున్నారన్న విమర్శలకు చెక్ పడింది.
అయితే ఈ సారి రాజ్యసభ పదవులు ఎవరెవరికి దక్కబోతున్నాయన్నది ఆసక్తి కరంగా మారింది. ఇటీవల రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడ్డ విషయం తెలిసిందే. ఏపీ నుంచి నాలుగు స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. విజయసాయిరెడ్డి, టీజీ వెంకటేశ్, సురేశ్ ప్రభు, సుజనాచౌదరిల పదవీ కాలం ముగియనున్నది. అయితే ఈ సారి సీఎం జగన్ ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
విజయసాయిరెడ్డికి మరోసారి చాన్స్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. మిగిలిన మూడు స్థానాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కేటాయించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారి ఎవరికి చాన్స్ దక్కుతుందో వేచి చూడాలి.