నూతన సాంకేతిక‌త‌లో తెలంగాణ‌ను అగ్ర‌గామిగా నిలపడమే మాలక్ష్యం -KTR

నూతన సాంకేతిక‌త‌లో తెలంగాణ‌ను అగ్ర‌గామిగా నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీలో ఇప్పటికే తెలంగాణ అద్భుతమైన పనితీరు కనబరుస్తోందని ఆయన తెలిపారు. HICCలో జరిగిన‌ మెడికల్ డివైస్ అండ్ ఇంప్లాట్స్ లో 3డీ ప్రింటింగ్ పై జాతీయ సదస్సులో కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నేషనల్ సెంటర్ ఫర్ అడిక్టీవ్ మానుఫాక్చరింగ్ తో మంత్రి సమక్షంలో పలు యూనివర్సిటీలు, కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ […]

Advertisement
Update:2022-05-13 07:37 IST

నూతన సాంకేతిక‌త‌లో తెలంగాణ‌ను అగ్ర‌గామిగా నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీలో ఇప్పటికే తెలంగాణ అద్భుతమైన పనితీరు కనబరుస్తోందని ఆయన తెలిపారు. HICCలో జరిగిన‌ మెడికల్ డివైస్ అండ్ ఇంప్లాట్స్ లో 3డీ ప్రింటింగ్ పై జాతీయ సదస్సులో కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నేషనల్ సెంటర్ ఫర్ అడిక్టీవ్ మానుఫాక్చరింగ్ తో మంత్రి సమక్షంలో పలు యూనివర్సిటీలు, కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ 3డీ ప్రింటింగ్ వల్ల రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇప్ప‌టికే టీ హ‌బ్‌లో 3డీ ప్రింటింగ్ ప్ర‌త్యేక ల్యాబ్‌ను ఏర్పాటు చేశామ‌ని చెప్పారు. ఆర్థోపెడిక్, డెంట‌ల్ తదితర‌ విభాగాల్లో ఇంప్లాంట్ల‌కు డిమాండ్ పెర‌గ‌డం వల్ల ఈ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందనిచెప్పారు. ప్ర‌స్తుతం ఈ రంగంలో అగ్రగామిగా ఎదిగేందుకు భార‌త్‌కు చ‌క్క‌టి అవ‌కాశ‌ముంద‌న్నారు. ఇప్పటికే సాంకేతికతలో దూసుకపోతున్న యూఎస్, యూరోపియ‌న్ మార్కెట్లకు పోటీ ఇచ్చే స్థాయి భారత్ కు ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News