సమ్మర్‌లో కరెంట్ బిల్ తగ్గించే చిట్కాలివే..

సమ్మర్‌లో కరెంట్ బిల్ ఎక్కువగా రాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.

Advertisement
Update:2023-04-23 12:00 IST

సమ్మర్‌లో కరెంట్ బిల్ తగ్గించే చిట్కాలివే..

సమ్మర్ రాగానే చాలామంది ఇంటిలో ఏసీ, కూలర్లు లాంటివి పెట్టిస్తుంటారు. పైగా ఈ సీజన్‌లో ఇంట్లో గడిపే సమయం ఎక్కువగా ఉంటుంది. అందుకే మిగతా సీజన్లతో పోలిస్తే సమ్మర్‌లో కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుంటుంది.

సమ్మర్‌లో కరెంట్ బిల్ ఎక్కువగా రాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ముందుగా సమ్మర్‌లో ఫ్రీజ్, ఏసీ, కూలర్ లాంటివి కొనేటప్పుడు రేటింగ్‌ చూసి కొనాలి. ఎంత ఎక్కువ రేటింగ్ ఉంటే అంత ఎక్కువ విద్యుత్ ఆదా చేస్తుందని అర్థం. ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటే విద్యుత్ ఎక్కువ ఆదా అవుతుంది.

ఏసీని ఎప్పుడూ 24 నుంచి 27 డిగ్రీల టెంపరేచర్ వద్ద ఉంచడం వల్ల చాలావరకూ పవర్‌ను సేవ్ చేయొచ్చు. టెంపరేచర్ తగ్గేకొద్దీ విద్యుత్ వినియోగం పెరగడంతో పాటు ఏసీ మన్నిక తగ్గుతుంది.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. గది విస్తీర్ణాన్ని బట్టి ఏసీని ఎంపిక చేసుకోవాలి. చిన్న గదికి కూడా పెద్ద ఏసీని పెట్టిస్తే అనవసరంగా విద్యుత్ వేస్ట్ చేసినవాళ్లమవుతాం.

ఇన్‌స్టలేషన్‌లో పొరపాట్లు కూడా ఏసీల బిల్లు పెరగడానికి కారణమని నిపుణులు చెప్తున్నారు. అలాగే పాత ఏసీలు వాడేవాళ్లు అప్పుడప్పుడు ఏసీలను సర్వీస్, క్లీనింగ్ లాంటివి చేయకపోవడం వల్ల కూడా పవర్ వినియోగం పెరుగుతుంది. ఏసీ మంచి కండీషన్‌లో ఉంటేనే విద్యుత్‌ ఆదా అవుతుంది.

ఏసీ అవుట్‌ డోర్‌ యూనిట్‌లో కండెన్సర్‌ కాయిల్‌, కండెన్సర్‌ ఫ్యాన్‌ ఉంటాయి. ఈ ఫ్యాన్‌పై ఎండ పడటం వల్ల ఏసీ సామర్థ్యం తగ్గుతుంది. గాలిని చల్లబరిచే శక్తిని కోల్పోతుంది. దీనివల్ల కూడా విద్యుత్ వినియోగంలో మార్పులొస్తాయి.

కరెంట్ బిల్ పెరగకుండా ఉండాలంటే మీ గది ఎంత సేపటిలో చల్లబడుతుందో గమనించి, ఆ సమయం వరకూ ఆన్ చేసి ఉంచి తర్వాతా ఆఫ్ చేస్తే సరిపోతుంది.

ఇక వీటితో పాటు ఎక్స్‌టెండెడ్ పవర్ స్ట్రిప్స్, ఛార్జింగ్ సాకెట్స్ వంటి వాటిని అవసరం లేనప్పుడు ఆఫ్ చేసి ఉంచడం, బయటకు వెళ్లేటప్పుడు స్విచ్‌లు అన్నీ ఆఫ్ చేసి వెళ్లడం ద్వారా కూడా కరెంటు బిల్లుని తగ్గించొచ్చు.

Tags:    
Advertisement

Similar News