మామూలు స్కెచ్ కాదుగా.. ఒక చెల్లి భర్తను చంపడానికి మరో చెల్లి భర్తను వాడేశాడు..

ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న దళిత యువకుడు నాగరాజు‌ను సొంత బావమరిదే సరూర్‌నగర్‌లో ఈనెల మొదటి వారంలో దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అశ్రిన్ సుల్తానా సోదరుడు మొబిన్ అహ్మద్.. తన చెల్లిని పెళ్లి చేసుకున్నాడనే కసితో నాగరాజును మహ్మద్ మసూద్ అనే వ్యక్తితో కలసి అందరూ చూస్తుండగానే దారుణంగా చంపేశాడు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్న వీరిద్దరి నుంచి మరిన్ని విషయాలు రాబట్టడానికి పోలీసులు కస్టడీ కోరతూ రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ […]

Advertisement
Update:2022-05-10 03:41 IST

ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న దళిత యువకుడు నాగరాజు‌ను సొంత బావమరిదే సరూర్‌నగర్‌లో ఈనెల మొదటి వారంలో దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అశ్రిన్ సుల్తానా సోదరుడు మొబిన్ అహ్మద్.. తన చెల్లిని పెళ్లి చేసుకున్నాడనే కసితో నాగరాజును మహ్మద్ మసూద్ అనే వ్యక్తితో కలసి అందరూ చూస్తుండగానే దారుణంగా చంపేశాడు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్న వీరిద్దరి నుంచి మరిన్ని విషయాలు రాబట్టడానికి పోలీసులు కస్టడీ కోరతూ రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు.

సన్నిహితులు, బంధువుల వివరాల ప్రకారం.. ఈ హత్యకు మొబిన్ అహ్మద్ పూర్తి స్కెచ్ వేసినట్లు తెలుస్తున్నది. ఒక చెల్లి భర్తను చంపడానికి.. ఇంకో చెల్లి భర్త సహాయం తీసుకోవడం గమనార్హం. నాగరాజు, మొబిన్‌కు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. అశ్రిన్‌తో ప్రేమవ్యవహారం తెలిసి గతంలో స్నేహితులతో కలసి నాగరాజును బెదిరించాడు. వీళ్లిద్దరికీ పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. ఈ క్రమంలోనే మరో స్నేహితుడు మహ్మద్ మసూద్‌ను తన రెండో చెల్లికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ పెళ్లి జరిగిన కొన్నాళ్లకే ఇంట్లో జరిగిన గొడవతో అశ్రిన్ ఇల్లు వదిలి పారిపోయి ఫిబ్రవరి 1న నాగరాజును ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నది.

అప్పటి నుంచి మొబిన్, మసూద్ కలసి నాగరాజు కోసం గాలింపు చేపట్టారు. అయితే అశ్రిన్, నాగరాజు వైజాగ్ వెళ్లిపోయారు. తన చెల్లితో అశ్రిన్ టచ్‌లో ఉన్నది. ఈ క్రమంలోనే వారిద్దరి ప్రాణాలకు ముప్పు ఉందని తెలుసుకున్న నాగరాజు.. వైజాగ్ నుంచి తన బంధువులు ఉండే సరూర్‌నగర్‌కు వచ్చాడు. వాళ్ల దగ్గర ఉంటే రక్షణగా ఉంటుందని భావించాడు. అయితే ఈ విషయం మొబిన్‌కు తెలిసిపోయింది. కానీ కరెక్ట్‌గా ఎక్కడ ఉంటున్నారో మాత్రం గుర్తించలేకపోయాడు.

ఆల్రెడీ వీరికి ఉన్న కామన్ ఫ్రెండ్స్ ద్వారా నాగరాజు ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ కనిపెట్టాడు. వాటిని తన మొబైల్‌లో వేసుకొని ‘ట్రాక్ మై డివైజ్’ యాప్ ద్వారా నాగరాజు కదలికల్ని మొబిన్ గమనిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో నాగరాజు మలక్‌పేటలోని ఒక కార్ షోరూంలో పని చేస్తున్నట్లు గుర్తించి.. అతడి హత్యకు రెక్కీ నిర్వహించాడు. అయితే రంజాన్ కావడంతో హత్యను వాయిదా వేసి.. పండగ అయిపోయిన వెంటనే తన బావ మహ్మద్ మసూద్‌తో కలసి మరోబావ నాగరాజును హత్య చేశాడు.

Tags:    
Advertisement

Similar News