హిట్ మ్యాన్..హిట్ హిట్ హుర్రే!.. ఐపీఎల్ సిక్సర్ల కింగ్ రోహిత్ శర్మ

టాటా- ఐపీఎల్ 15వ సీజన్ లీగ్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. సిక్సర్ల బాదుడులో తనకుతానే సాటిగా నిలిచాడు. ముంబై బ్రబోర్న్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో ముగిసిన 11వ రౌండ్ పోరులో హిట్ మ్యాన్ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. తొలి ఓవర్ లోనే ఫాస్ట్ బౌలర్ అర్జారీ జోసెఫ్ బౌలింగ్ లో పుల్ షాట్ సిక్సర్ తో.. సిక్సర్ల ద్విశతకం […]

Advertisement
Update:2022-05-07 11:18 IST

టాటా- ఐపీఎల్ 15వ సీజన్ లీగ్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. సిక్సర్ల బాదుడులో తనకుతానే సాటిగా నిలిచాడు. ముంబై బ్రబోర్న్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో ముగిసిన 11వ రౌండ్ పోరులో హిట్ మ్యాన్ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. తొలి ఓవర్ లోనే ఫాస్ట్ బౌలర్ అర్జారీ జోసెఫ్ బౌలింగ్ లో పుల్ షాట్ సిక్సర్ తో.. సిక్సర్ల ద్విశతకం పూర్తి చేశాడు. ముంబై ఇండియన్స్ త‌ర‌ఫున ఐపీఎల్ లో 200 సిక్సర్ల మైలురాయిని చేరిన తొలి కెప్టెన్ గా, రెండో బ్యాటర్ గా నిలిచాడు.

పోలార్డ్ 257- రోహిత్ 200 సిక్సర్లు..
గత 15 సీజన్ల ఐపీఎల్ లో ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్ త‌ర‌ఫున 200కు పైగా సిక్సర్లు బాదిన ఇద్దరు మొనగాళ్లలో కీరాన్ పోలార్డ్ 257 సిక్సర్లతో అగ్రస్థానంలో నిలిచాడు. 200 సిక్సర్లతో రోహిత్ ఆ తర్వాతి స్థానంలో ఉన్నాడు. టీ-20 ఫార్మాట్లో 400 సిక్సర్లు బాదిన భారత తొలి బ్యాటర్ గా రోహిత్ గత ఏడాది ఐపీఎల్ లో రికార్డు నెలకొల్పాడు. రోహిత్ త‌ర్వాత మరే భారత బ్యాట‌ర్ కూడా 350 సిక్స‌ర్లు దాటలేదు. 325 సిక్స‌ర్ల‌తో సీఎస్కే బ్యాట‌ర్ సురేశ్ రైనా రెండోస్థానంలో ఉండ‌గా.. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి 320 సిక్స‌ర్ల‌తో మూడో స్థానంలో ఉన్నాడు. ధోనీ 306 సిక్స్‌లు కొట్టాడు. ఇక రోహిత్ బాదిన మొత్తం 400 సిక్స‌ర్ల‌లో 133 ఇండియ‌న్ టీమ్ త‌ర‌ఫున కాగా.. 229 ఐపీఎల్‌లో బాదాడు. మ‌రో 24 చాంపియన్స్ లీగ్ టీ20లో కొట్టాడు. టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక సిక్స్‌ల రికార్డు విండీస్ దిగ్గ‌జం క్రిస్ గేల్ పేరిట ఉంది. 1042 సిక్స‌ర్ల‌తో అత‌డు ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో ఉన్నాడు. క్రికెట్ చ‌రిత్ర‌లో 1000 సిక్స‌ర్లు దాటిన ఏకైక ప్లేయ‌ర్ అత‌డే. ఆ త‌ర్వాత పొలార్డ్ (758), ర‌సెల్ (510), బ్రెండ‌న్ మెక‌ల‌మ్ (485), షేన్ వాట్స‌న్ (467), ఏబీ డివిలియ‌ర్స్ (434) ఉన్నారు.

సూపర్ హిట్టర్ క్రిస్ గేల్..
ఐపీఎల్ లో ఓ జట్టు తరపున అత్యధిక సిక్సర్లు బాదిన మొనగాడిగా కరీబియన్ థండర్ హిట్టర్ క్రిస్ గేల్ నిలిచాడు. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ త‌ర‌ఫున క్రిస్ గేల్ 263 సిక్సర్లు, ఏబీ డివిలియర్స్ 240 సిక్సర్లు, విరాట్ కోహ్లీ 228 సిక్సర్లు, చెన్నై సూపర్ కింగ్స్ త‌ర‌ఫున సురేశ్ రైనా 220 సిక్సర్లు, మహేంద్ర సింగ్ ధోనీ 218 సిక్సర్లు సాధించిన బ్యాటర్లుగా ఉన్నారు.

వార్నర్ ను మించిన రోహిత్ ..
గుజరాత్ టైటాన్స్ పై రోహిత్ 43 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించడం ద్వారా..ఐపీఎల్ లో అత్యధిక పరుగులు సాధించిన మొదటి ముగ్గురు బ్యాటర్లలో ఒకడిగా నిలిచాడు. ఈ క్రమంలో డేవిడ్ వార్నర్ రికార్డును అధిగమించాడు. విరాట్ కోహ్లీ 6వేల 499 పరుగులు, శిఖర్ ధావన్ 6 వేల 153 పరుగులతో మొదటి రెండుస్థానాలలో కొనసాగుతున్నారు. రోహిత్ శర్మ మూడు, డేవిడ్ వార్నర్ నాలుగో అత్యుత్తమ స్కోరర్లుగా ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News