నో ఫోన్ జోన్లుగా టెన్త్ పరీక్షా కేంద్రాలు..

ఏపీలో టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలు ఈ ఏడాది లీకేజీల సుడిగుండంలో చిక్కుకున్నాయి. ప్రతి రోజూ ఏదో ఒక సెంటర్ నుంచి క్వశ్చన్ పేపర్ సోషల్ మీడియా ద్వారా బయటకు రావడం, మాస్ కాపీయింగ్ వంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పరీక్షలను పర్యవేక్షించాల్సిన ఉపాధ్యాయులే కట్టుతప్పడంతో పేపర్ లీకేజీని అడ్డుకోవడం సాధ్యపడటంలేదు. ఓవైపు ప్రతిపక్షాల విమర్శలు, మరోవైపు తల్లిదండ్రుల ఆందోళనల మధ్య రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చింది. ఏపీలోని టెన్త్ క్లాస్ పరీక్షా కేంద్రాలను […]

Advertisement
Update:2022-05-03 17:09 IST

ఏపీలో టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలు ఈ ఏడాది లీకేజీల సుడిగుండంలో చిక్కుకున్నాయి. ప్రతి రోజూ ఏదో ఒక సెంటర్ నుంచి క్వశ్చన్ పేపర్ సోషల్ మీడియా ద్వారా బయటకు రావడం, మాస్ కాపీయింగ్ వంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పరీక్షలను పర్యవేక్షించాల్సిన ఉపాధ్యాయులే కట్టుతప్పడంతో పేపర్ లీకేజీని అడ్డుకోవడం సాధ్యపడటంలేదు. ఓవైపు ప్రతిపక్షాల విమర్శలు, మరోవైపు తల్లిదండ్రుల ఆందోళనల మధ్య రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చింది. ఏపీలోని టెన్త్ క్లాస్ పరీక్షా కేంద్రాలను నో ఫోన్ జోన్లుగా ప్రకటించింది. అంటే పరీక్ష జరుగుతున్నంత సేపు పరీక్ష కేంద్రంలో ఒక్క సెల్ ఫోన్ కూడా ఉండకూడదన్నమాట. సెల్ ఫోన్లతోపాటు, స్మార్ట్ వాచ్, ఇయర్ ఫోన్, ఐపాడ్.. ఇలా ఏ ఎలక్ట్రానిక్ వస్తువుకి కూడా పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదు.

పరీక్షలంటే సహజంగా పిల్లల వద్ద ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లేకుండా క్షుణ్ణంగా పరిశీలించి ఎగ్జామ్ హాల్ లోకి పంపిస్తుంటారు. కానీ ఏపీలో ఇప్పటి వరకూ జరిగిన టెన్త్ క్వశ్చన్ పేపర్ లీకేజీ ఘటనల్లో ఉపాధ్యాయులే ముద్దాయిలుగా ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో క్షణాల్లో పరీక్ష పేపర్ బయటకు వచ్చేస్తోంది. వాట్సప్ లలో షేర్ అవుతోంది. వెంటనే ఆన్సర్లు పరీక్ష కేంద్రాల్లోకి వెళ్తున్నాయి. దీంతో సమస్యకు మొదట్లోనే చెక్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. సెల్ ఫోన్లను పరీక్ష కేంద్రంలోకి అనుమతించకపోతే అసలు క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చే అవకాశమే లేదు. అందుకే పరీక్ష కేంద్రాలను నో ఫోన్ జోన్లుగా ప్రకటించింది. పాఠశాల చీఫ్ సూపరింటెండెంట్ కూడా ఎగ్జామ్ సెంటర్లోకి సెల్ ఫోన్ తీసుకెళ్లడానికి వీల్లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తే పరీక్ష కేంద్రంలో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువుల్ని వెంటనే జప్తు చేస్తామని విద్యాశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

క్వశ్చన్ పేపర్ విద్యార్థులకు ఇచ్చిన వెంటనే.. ప్రతి పేజీ మీద సెంటర్ నెంబర్, రోల్ నెంబర్ రాయాలని ఇన్విజిలేటర్లకు ఆదేశాలు జారీ చేసింది విద్యాశాఖ. అలా నెంబర్లు రాస్తే.. ఒకవేళ క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చినా, తప్పు చేసినవారెవరో, ఏ సెంటర్ నుంచి క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చిందో వెంటనే తెలిసిపోతుంది. పరీక్ష నిర్వహణలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది విద్యాశాఖ.

Tags:    
Advertisement

Similar News