కెప్టెన్ ధోనీయా.. మజాకా!.. రైజర్స్ పై చెన్నై సూపర్ విన్

ఐపీఎల్ లో నాలుగుసార్లు విజేత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా మహేంద్రసింగ్ ధోనీ తన రెండో ఇన్నింగ్స్ ను కళ్లు చెదిరే విజయంతో ప్రారంభించాడు. ప్రస్తుత సీజన్ ప్రారంభం నుంచి జరిగిన ఎనిమిది రౌండ్ల మ్యాచ్ ల్లో చెన్నైకి నాయకత్వం వహించిన రవీంద్ర జడేజా.. కెప్టెన్సీ ఇక తనవల్ల కాదంటూ మొరపెట్టుకోడంతో.. ధోనీ మరోసారి జట్టు పగ్గాలు చేపట్టాడు. ఎనిమిది మ్యాచ్ ల విరామం తర్వాత చెన్నై కెప్టెన్ గా ధోనీ తన తొలిమ్యాచ్ లోనే […]

Advertisement
Update:2022-05-02 07:44 IST

ఐపీఎల్ లో నాలుగుసార్లు విజేత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా మహేంద్రసింగ్ ధోనీ తన రెండో ఇన్నింగ్స్ ను కళ్లు చెదిరే విజయంతో ప్రారంభించాడు. ప్రస్తుత సీజన్ ప్రారంభం నుంచి జరిగిన ఎనిమిది రౌండ్ల మ్యాచ్ ల్లో చెన్నైకి నాయకత్వం వహించిన రవీంద్ర జడేజా.. కెప్టెన్సీ ఇక తనవల్ల కాదంటూ మొరపెట్టుకోడంతో.. ధోనీ మరోసారి జట్టు పగ్గాలు చేపట్టాడు. ఎనిమిది మ్యాచ్ ల విరామం తర్వాత చెన్నై కెప్టెన్ గా ధోనీ తన తొలిమ్యాచ్ లోనే జట్టును విజేతగా నిలిపాడు.

ధోనీ మ్యాజిక్..
పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుతో ముగిసిన హైస్కోరింగ్ పోరులో చెన్నై 13 పరుగుల విజయం సాధించడంలో ధోనీ నాయకత్వ పటిమ ఎంతో ఉంది. ధోనీ కెప్టెన్ గా ఉన్నాడంటే చాలు.. జట్టు సభ్యుల్లో ఏదో తెలియని ఆనందం, ఉరకలేసే ఆత్మవిశ్వాసం ప్రస్పుటమవుతుంది. మొదటి ఎనిమిదిరౌండ్లలో రెండు విజయాలు, 6 పరాజయాల రికార్డుతో లీగ్ టేబుల్ అట్టడుగునుంచి రెండోస్థానంలో నిలిచిన చెన్నై.. సన్ రైజర్స్ తో ముగిసిన పోరులో కేవలం 2 వికెట్లు మాత్రమే నష్టపోయి 202 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ ( 99)- డేవన్ కాన్వే ( 85 నాటౌట్ ) స్కోర్లతో మొదటి వికెట్ కు 182 పరుగుల భాగస్వామ్యం అందించడంతోనే చెన్నై విజయం ఖాయమైపోయింది. ప్రత్యర్థి ఎదుట 203 పరుగుల భారీలక్ష్యం ఉంచటం, కుదురైన ఫీల్డింగ్ తో తెలివిగా బౌలర్లను మార్చుతూ ధోనీ మ్యాచ్ ను నియంత్రించగలిగాడు. తన జట్టుకు 13 పరుగుల కీలక విజయం అందించగలిగాడు. ఈ విజయంతో చెన్నై మొదటి 9 రౌండ్లలో 6 పాయింట్లతో నిలిచింది. లీగ్ దశ మిగిలిన ఐదు రౌండ్లలో నెగ్గగలిగితేనే చెన్నై ప్లే ఆఫ్ రౌండ్ ఆశల్ని సజీవంగా నిలుపుకోగలుగుతుంది.

ద్రావిడ్ ను మించిన ధోనీ..
ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో కెప్టెన్ గా వ్యవహరించిన అతిపెద్ద వయస్కుడిగా పేరున్న రాహుల్ ద్రావిడ్ ( 40 సంవత్సరాల 268 రోజుల ) రికార్డును ధోనీ 40 సంవత్సరాల 298 రోజుల వయసుతో అధిగమించాడు. టీ-20 క్రికెట్లో లేటువయసులో నాయకత్వం వహించిన ఆటగాడిగా, తనజట్టుకు 40 సంవత్సరాల 298 రోజుల వయసులో విజయం అందించిన నాయకుడిగా ధోనీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. రాజస్థాన్ రాయల్స్ కు ద్రావిడ్ ( 40 సంవత్సరాల 258 రోజులు ), సునీల్ జోషీ ( 40 సంవత్సరాల 135 రోజులు0, అనీల్ కుంబ్లే ( 39 సంవత్సరాల 342 రోజులు ), సౌరవ్ గంగూలీ ( 39 ఏళ్ల 316 రోజుల ) లేటు వయసులో టీ-20 మ్యాచ్ ల్లో నాయకత్వం వహించిన దిగ్గజాలుగా ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News