విజయవాడ, రేపల్లె, ఇప్పుడు నూజివీడు.. ఏపీలో మరో దారుణం..
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచారం, రేపల్లె రైల్వే స్టేషన్లో గర్భిణిపై గ్యాంగ్ రేప్.. ఈ దుర్ఘటనలు మరచిపోకముందే.. నూజివీడులో మరో అమానుషం వెలుగు చూసింది. ఆటో డ్రైవర్ తనపై అత్యాచారం చేయబోయాడంటూ ఓ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే ఆటో డ్రైవర్ ని అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అసలేం జరిగింది..? నూజివీడుకి చెందిన ఓ మైనర్ బాలికకు ఫేస్ బుక్ లో బెంగళూరుకి చెందిన ఆంజనేయులు పరిచయం […]
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచారం, రేపల్లె రైల్వే స్టేషన్లో గర్భిణిపై గ్యాంగ్ రేప్.. ఈ దుర్ఘటనలు మరచిపోకముందే.. నూజివీడులో మరో అమానుషం వెలుగు చూసింది. ఆటో డ్రైవర్ తనపై అత్యాచారం చేయబోయాడంటూ ఓ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే ఆటో డ్రైవర్ ని అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
అసలేం జరిగింది..?
నూజివీడుకి చెందిన ఓ మైనర్ బాలికకు ఫేస్ బుక్ లో బెంగళూరుకి చెందిన ఆంజనేయులు పరిచయం అయ్యాడు. వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ప్రేమికుడు విజయవాడ వస్తున్నానని చెప్పడంతో ఆ బాలిక కూడా నూజివీడు నుంచి విజయవాడ వచ్చింది. అయితే ఆ తర్వాత ఆంజనేయులు ఫోన్ స్విచ్ఛాఫ్ కావడం, హోటల్ అడ్రస్ దొరక్కపోవడంతో ఆమె భయపడిపోయింది. ప్రియుడిని వెదుకుతూ ఓ ఆటోలో బయలుదేరింది. ఒంటరి బాలిక కావడం, పైగా ప్రియుడికోసం వెదుకుతూ ఆందోళనపడుతుండే సరికి, ఆటో డ్రైవర్ అడ్వాంటేజ్ తీసుకున్నాడు. సాయంత్రం వరకు ఆమెను తన ఆటోలోనే తిప్పాడు. రాత్రికి ఇంటికి వెళ్లలేవు అని చెప్పి, తనతోపాటు తన ఇంటికి తీసుకెళ్తానన్నాడు. మధ్యలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి రేప్ చేయబోయాడు. దీంతో ఆ అమ్మాయి బెదిరిపోయింది. ఆటో డ్రైవర్ నుంచి తప్పించుకుని వెళ్లి కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రాష్ట్రంలో వరుసగా ఇలాంటి దారుణాలు జరుగుతుండే సరికి పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే ఆటో డ్రైవర్ కోసం వెదుకులాట మొదలు పెట్టారు. సింగ్ నగర్ కి చెందిన ఆటో డ్రైవర్ ని అరెస్ట్ చేసి IPC సెక్షన్ 363, 354, 506, పొక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.