సెమి కండక్టర్ల కష్టాలకు చెల్లుచీటీ పాడేస్తారా..?

కరోనా వచ్చినా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వచ్చినా.. ఇతర కారణాలేవయినా భారత్ లో ఏదో ఒక రంగం తీవ్రమైన ప్రభావం ఎదుర్కోవాల్సిందే. ముఖ్యంగా విడిభాగాల దిగుమతులపై ఆధారపడ్డ వాహన రంగం ఇటీవల కాలంలో ఒడిదొడుకులకు లోనైంది. డిమాండ్ ఎక్కువ ఉన్న వాహనాల మోడళ్లకోసం నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. కారణం ఒకటే. సెమికండక్టర్లు, లేదా చిప్ ల విషయంలో తీవ్ర కొరత ఏర్పడటంతో భారత్ లో వాహనాల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. దీనికి మేకిన్ ఇండియా తో […]

Advertisement
Update:2022-04-30 09:48 IST

కరోనా వచ్చినా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వచ్చినా.. ఇతర కారణాలేవయినా భారత్ లో ఏదో ఒక రంగం తీవ్రమైన ప్రభావం ఎదుర్కోవాల్సిందే. ముఖ్యంగా విడిభాగాల దిగుమతులపై ఆధారపడ్డ వాహన రంగం ఇటీవల కాలంలో ఒడిదొడుకులకు లోనైంది. డిమాండ్ ఎక్కువ ఉన్న వాహనాల మోడళ్లకోసం నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. కారణం ఒకటే. సెమికండక్టర్లు, లేదా చిప్ ల విషయంలో తీవ్ర కొరత ఏర్పడటంతో భారత్ లో వాహనాల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. దీనికి మేకిన్ ఇండియా తో శాశ్వత పరిష్కారం చూపెట్టాలని చూస్తోంది కేంద్ర ప్రభుత్వం.

బెంగళూరులో సెమికాన్‌ ఇండియా–2022 సదస్సు ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రధాని 2026 నాటికి దేశీయంగా 6లక్షల కోట్ల రూపాయల విలువైన సెమి కండక్టర్ల తయారీని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు తెలిపారు. అయితే ఇది అనుకున్నంత సులభంగా సాధ్యమవుతుందా అనేది ప్రశ్నార్థకం. గతంలో కూడా మేకిన్ ఇండియాలో భాగంగా మొదలైన ప్రాజెక్ట్ లు అనుకున్న స్థాయిలో లక్ష్యాలను అందుకోలేదు. సెమికండక్టర్ల వ్యవహారం మాత్రం భారత్ లోని కంపెనీలకు జీవన్మరణ సమస్యగా మారింది. దీంతో ఇప్పటికిప్పుడు చిప్ ల తయారీ మొదలు పెట్టక తప్పేలా లేదు.

5 కంపెనీల ఆసక్తి..
భారత్ లో సెమి కండక్టర్ల తయారీకి ఐదు కంపెనీలు ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. సెమికాన్ ఇండియా సదస్సులో ఆ 5 కంపెనీలు తమ ప్రతిపాదనలతో ముందుకొచ్చాయి. 1.53 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించాయి. ఆరేడు నెలల్లోనే వీటికి అవసరమైన అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. సెమికండక్టర్ల తయారీ అనుకున్న స్థాయిలో జరిగితే.. ప్రపంచ దేశాలకు భారత్ మరో ప్రత్యామ్నాయం అవుతుందని చెప్పారాయన.

Tags:    
Advertisement

Similar News