భారత సాయుధ బలగాల్లో పెరుగుతున్న ఆత్మహత్యలు..
సాయుధ బలగాల్లో చేరేవారు సామాన్య ప్రజలకంటే ధైర్యంగా ఉంటారని అందరూ అనుకుంటారు. ధైర్యం, తెగువ, శారీరక దారుఢ్యం ఉన్నవారే రక్షణ రంగంలోనూ, పోలీస్ వ్యవస్థలోనూ చేరుతుంటారు. కానీ ఇటీవల కాలంలో సాయుధ బలగాల్లో ఆత్మహత్యల సంఖ్య ఆందోళనకర రీతిలో పెరిగిపోతోంది. కేంద్ర హోం శాఖ విడుదల చేసిన గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF).. అంటే సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్.ఎస్.బి., బీఎస్ఎఫ్, ఎన్.ఎస్.జి., అస్సాం రైఫిల్స్.. లో […]
సాయుధ బలగాల్లో చేరేవారు సామాన్య ప్రజలకంటే ధైర్యంగా ఉంటారని అందరూ అనుకుంటారు. ధైర్యం, తెగువ, శారీరక దారుఢ్యం ఉన్నవారే రక్షణ రంగంలోనూ, పోలీస్ వ్యవస్థలోనూ చేరుతుంటారు. కానీ ఇటీవల కాలంలో సాయుధ బలగాల్లో ఆత్మహత్యల సంఖ్య ఆందోళనకర రీతిలో పెరిగిపోతోంది. కేంద్ర హోం శాఖ విడుదల చేసిన గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF).. అంటే సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్.ఎస్.బి., బీఎస్ఎఫ్, ఎన్.ఎస్.జి., అస్సాం రైఫిల్స్.. లో పనిచేసే వారు ఇటీవల కాలంలో తరచూ ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. 2021లో మొత్తం 156మంది ఇలా బలవన్మరణాలకు పాల్పడ్డారు. అంటే సగటున రెండు రోజులకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కారణాలేవైనా సాయుధ బలగాలకు చెందినవారు ఇలా ఆత్మహత్యలకు పాల్పడం మాత్రం ఆందోళన కలిగించే అంశం. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో ఆత్మహత్యలు జరగలేదు. దశాబ్ద కాలంలో ఇదే అత్యథికం అంటూ కేంద్ర హోంశాఖ తరపున లోక్ సభలో ఓ నివేదిక బహిర్గతం చేశారు.
2012నుంచి 2021 వరకు కేంద్ర సాయుధ బలగాల్లో ఆత్మహత్యలు చేసుకున్నవారి సంఖ్య 1205గా రికార్డులకెక్కింది. అయితే కరోనా, లాక్ డౌన్ తర్వాత ఆత్మహత్యల సంఖ్య పెరిగినట్టు స్పష్టమవుతోంది. 2020 లో 143మంది 2021లో 156మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మానసిక రుగ్మతలు, భావోద్వేగాల నియంత్రణ సాధ్యం కాకపోవడం వల్ల ఇలా ఆత్మహత్యలు పెరుగుతున్నాయని తెలుస్తోంది. సాయుధ బలగాల్లో పనిచేస్తున్నవారికి సరైన కౌన్సెలింగ్ ఇవ్వాలని, ఎప్పటికప్పుడు వారి మానసిక పరిస్థితిని అంచనా వేసి, వైద్య సహాయం అందివ్వాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.