ఏపీ బడ్జెట్ లో సంక్షేమ పథకాల కోసం భారీ కేటాయింపులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ 2022-23ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి. రూ. 2,56,256 కోట్ల బడ్జెట్ లో రెవెన్యూ వ్యయం రూ. 2,08,261 కోట్లు, మూల ధన వ్యయం రూ. 47,996 కోట్లు కాగా.. రెవెన్యూ లోటు రూ. 17,036 కోట్లు, ద్రవ్య లోటు రూ. 48,724 కోట్లుగా పేర్కొన్నారు. సంక్షేమ పథకాలకు భారీగా కేటాయింపులు జరిగాయి. వైఎస్సార్ పెన్షన్ కానుక పథకానికి అత్యథికంగా రూ. 18 వేల కోట్లను […]

Advertisement
Update:2022-03-11 10:00 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ 2022-23ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి. రూ. 2,56,256 కోట్ల బడ్జెట్ లో రెవెన్యూ వ్యయం రూ. 2,08,261 కోట్లు, మూల ధన వ్యయం రూ. 47,996 కోట్లు కాగా.. రెవెన్యూ లోటు రూ. 17,036 కోట్లు, ద్రవ్య లోటు రూ. 48,724 కోట్లుగా పేర్కొన్నారు. సంక్షేమ పథకాలకు భారీగా కేటాయింపులు జరిగాయి.

వైఎస్సార్ పెన్షన్ కానుక పథకానికి అత్యథికంగా రూ. 18 వేల కోట్లను బడ్జెట్ లో కేటాయించారు. ఈ ఏడాది పెన్షన్ మొత్తం పెరగడంతో బడ్జెట్ కేటాయింపులు కూడా పెరిగాయి. అమ్మ ఒడికి 6,500 కోట్ల రూపాయలు, రైతు భరోసాకోసం 3, 900 కోట్ల రూపాయలు, విద్యా దీవెన కోసం 2, 500 కోట్ల రూపాయలు, వసతి దీవెన కోసం 2,083 కోట్ల రూపాయలు కేటాయించారు.

సామాజిక సేవా రంగానికి సింహ భాగం..
విద్య, వైద్యం, హౌసింగ్, పట్టణాభివృద్ధి, పారిశుధ్యం.. వంటి సామాజిక సేవారంగ విభాగాలకు ఈ ఏడాది బడ్జెట్ లో సింహభాగం కేటాయింపులు జరిగాయి. మొత్తంగా సామాజిక సేవా రంగాల కోసం రూ. 1,13,340.20 కోట్లు కేటాయించారు. ఏపీ బడ్జెట్ లో ఇది 44.23 శాతానికి సమానం. విద్యకు 30, 077 కోట్ల రూపాయలు, హౌసింగ్ విభాగానికి 4,791.69 కోట్ల రూపాయలు, వైద్య రంగానికి 15, 384.26 కోట్ల రూపాయలు కేటాయించారు.

ఆర్థిక సేవల రంగానికి 27.5 శాతం నిధులు..
ఏపీ బడ్జెట్ లో ఆర్థిక సేవల రంగానికి 69, 306. 74 కోట్ల రూపాయలు కేటాయించారు. మొత్తం బడ్జెట్ లో ఇది 27.5 శాతం. వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,630.1 కోట్ల రూపాయలు కేటాయించారు. మార్కెటింగ్ యార్డుల్లో నాడు-నేడు, మార్కెటింగ్ శాఖ అభివృద్ధికి రూ. 614.23 కోట్లు, సహకార శాఖకు రూ.248.45 కోట్లు, ఆహార శుద్ధి విభాగానికి రూ.146.41 కోట్లు కేటాయించారు. అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశ పెట్టారు.

బడ్జెట్ కంటే ముందు సోషియో ఎకనామిక్ సర్వే విడుదల..
అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు సోషియో ఎకనామిక్‌ సర్వేను సీఎం వైఎస్‌ జగన్‌ విడుదల చేశారు. వ్యవసాయ రంగంలో 14.5 శాతం ప్రగతి నమోదు అయినట్టు ఆ సర్వేలో పేర్కొన్నారు. జీఎస్డీపీలో వృద్ధి రేటు బాగా పెరిగిందని తెలిపారు. పరిశ్రమల రంగంలో 25.5 శాతం, సేవా రంగంలో 18.9 శాతం ప్రగతి నమోదు అయిందని స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News