భారత్ లో ఇంతే.. భర్త మాట భార్య వినాల్సిందే..
భార్య, భర్త ఇద్దరూ సమానం అని అంటూనే.. భర్త కాస్త ఎక్కువ సమానం అంటారు భారతీయులు. అంటే భార్యపై భర్త ఆధిపత్యం ఉండాలనేది భారతీయుల ఆలోచనగా చెబుతుంటారు. కాలం మారింది, మగవాళ్లకి ఏ విషయంలోనూ ఆడవారు తీసిపోరని నిరూపించుకుంటున్నారు. మగవారు మాత్రమే చేయగలరు అనే కష్టసాధ్యమైన పనుల్ని కూడా మహిళలు సులభంగా ఆకళింపు చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా పురుషుల ఆలోచన ధోరణి మారకపోవడం మాత్రం విశేషం. పురుషులే కాదు.. మహిళల్లో కూడా కొంతమంది కుటుంబ వ్యవహారాల్లో పురుషుల […]
భార్య, భర్త ఇద్దరూ సమానం అని అంటూనే.. భర్త కాస్త ఎక్కువ సమానం అంటారు భారతీయులు. అంటే భార్యపై భర్త ఆధిపత్యం ఉండాలనేది భారతీయుల ఆలోచనగా చెబుతుంటారు. కాలం మారింది, మగవాళ్లకి ఏ విషయంలోనూ ఆడవారు తీసిపోరని నిరూపించుకుంటున్నారు. మగవారు మాత్రమే చేయగలరు అనే కష్టసాధ్యమైన పనుల్ని కూడా మహిళలు సులభంగా ఆకళింపు చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా పురుషుల ఆలోచన ధోరణి మారకపోవడం మాత్రం విశేషం. పురుషులే కాదు.. మహిళల్లో కూడా కొంతమంది కుటుంబ వ్యవహారాల్లో పురుషుల ఆధిపత్యమే ఉండాలని కోరుకుంటున్నారట. అమెరికా సంస్థ భారత్ లో జరిపిన ఓ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
భర్తల మాట భార్యలు విని తీరాల్సిందేననేది.. 87శాతం మంది భారతీయులు అభిప్రాయంగా చెబుతోంది ఆ సర్వే. 29,999 మంది యువజనులనుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఈ విషయాన్ని క్రోడీకరించింది. భారత్ లోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ సర్వే జరిగింది. దాదాపు 17 భాషల్లో ఇంటర్వ్యూలు చేశారు. పురుషులతోపాటు మహిళలకు కూడా సమాన హక్కులు ఉండాలని చెబుతూనే.. వైవాహిక బంధం ఏర్పడిన తర్వాత భార్య తన భర్త మాట వినాల్సిందేనని అంటున్నారు వీరంతా.
భార్య కచ్చితంగా భర్త మాట వినాల్సిందేనని 64శాతం మంది తమ అభిప్రాయాన్ని చెప్పగా.. 87 శాతం మంది దాదాపుగా దీన్ని అంగీకరించారు. అంటే స్త్రీ సమానత్వం అనేది కేవలం ప్రచారాలు, ప్రకటనల్లోనే మనకు కనపడుతోందనే విషయం అర్థమవుతోంది. భారతీయుల్లో మాత్రం ఇంకా ఆ వివక్ష పూర్తిగా తొలగిపోలేదు. భార్యా భర్తల బంధం విషయంలో అన్యోన్యం కంటే ఆధిపత్యమే ఉండాలనేది మెజార్టీ ప్రజల అభిప్రాయంగా అమెరికన్ సంస్థ సర్వే చెబుతోంది.