ఎయిరిండియా కొత్త యాజమాన్యం టాటా సన్స్ కి తొలి షాక్..

ఎయిరిండియాని తిరిగి సొంతం చేసుకున్న టాటా సన్స్ కి ఆదిలోనే చిన్న షాక్ తగిలింది. తమ అధీనంలోకి వచ్చాక ఎయిరిండియాకి కొత్త సీఈఓగా టర్కిష్ ఎయిర్ లైన్స్ మాజీ చైర్మన్ ఇల్కర్ ఐకీ పేరుని ఖరారు చేసింది టాటా సంస్థ. టర్కిష్ ఎయిర్ లైన్స్ నిర్వహణ విషయంలో ఆయన ప్రతిభ ఆధారంగా ఈ నియామకం జరిగింది. అయితే ఆ బాధ్యతలు చేపట్టకుండానే ఆయన టాటా ఆఫర్ ని తిరస్కరించారు. ఏంటీ గొడవ..? ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగం అయిన […]

Advertisement
Update:2022-03-02 04:40 IST

ఎయిరిండియాని తిరిగి సొంతం చేసుకున్న టాటా సన్స్ కి ఆదిలోనే చిన్న షాక్ తగిలింది. తమ అధీనంలోకి వచ్చాక ఎయిరిండియాకి కొత్త సీఈఓగా టర్కిష్ ఎయిర్ లైన్స్ మాజీ చైర్మన్ ఇల్కర్ ఐకీ పేరుని ఖరారు చేసింది టాటా సంస్థ. టర్కిష్ ఎయిర్ లైన్స్ నిర్వహణ విషయంలో ఆయన ప్రతిభ ఆధారంగా ఈ నియామకం జరిగింది. అయితే ఆ బాధ్యతలు చేపట్టకుండానే ఆయన టాటా ఆఫర్ ని తిరస్కరించారు.

ఏంటీ గొడవ..?
ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగం అయిన స్వదేశీ జాగరణ్ మంచ్ (ఎస్.జె.ఎం.) అభ్యంతరాలు వ్యక్తం చేయడమే ఈ గొడవకు కారణం. టాటా సన్స్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన ఎస్.జె.ఎం. ఆమేరకు ప్రభుత్వం టాటా సన్స్ ని నియంత్రించాలని కోరింది. ప్రస్తుత టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ 1994లో ఇస్తాంబుల్ మేయర్ గా పనిచేసినప్పుడు అతనికి సలహాదారుగా ఇల్కర్ ఐకీ ప‌ని చేశారనే విషయాన్ని ఎస్.జె.ఎం. గుర్తు చేసింది. ఐకీ పూర్వాప‌రాల‌పై పూర్తిగా ద‌ర్యాప్తు చేయాల‌ని కేంద్రాన్ని కోరింది. దీంతో ఐకీ హర్ట్ అయ్యారు. సీఈఓ బాధ్యతలు చేపట్టకూడదని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు టాటా సన్స్ గ్రూప్ కి వర్తమానం పంపారు.

భారత మీడియాలోని కొన్ని వర్గాలు తన నియామకంపై అనవసరపు రంగులద్దాలనుకుంటున్నాయని అంటూ ఐకీ ఎయిరిండియా సీఈఓ స్థానాన్ని వద్దనుకుంటున్నట్టు తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఈ పదవిని అంగీకరించడం అంత గౌరప్రదమైన, సాధ్యమయ్యే నిర్ణయం కాదని తాను భావిస్తున్నట్టు ఇల్కర్ ఐకీ పేర్కొన్నారు.

టాటా ఎయిర్ సర్వీస్ పేరుతో 1932లో ఎయిరిండియా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత 1953లో ఈ ఎయిర్ లైన్స్‌ ను జాతీయం చేశారు. పూర్తిగా అప్పుల ఊబిలో చిక్కుకున్న ఎయిర్ ఇండియాను ఇటీవల టాటా స‌న్స్ టేకోవ‌ర్ చేసింది. ఎయిరిండియాకి మునుపటి వైభవం తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా నూతన సీఈవోగా ఇల్కర్ ఐకీ నియామ‌కం చేపట్టింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 లోగా ఎయిరిండియా సరికొత్త బాధ్యతలను చేపట్టాలని టాటా సన్స్ ఆయనను కోరింది. రెగ్యులేటరీ ఆమోదాల మేరకే ఈ కొత్త నియామకం ఉందని కూడా తెలిపింది. అయితే ఈ నియామకం రాజకీయ వివాదానికి కారణం అవుతున్న వేళ ఐకీ స్వచ్ఛందంగా తప్పుకున్నారు.

Tags:    
Advertisement

Similar News