కర్నాటకలో స్కూల్స్ కి మళ్లీ సెలవలు.. కారణం కరోనా కాదు, హిజాబ్

నిన్న మొన్నటి వరకు కరోనా కారణంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు సెలవలు ఇచ్చారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడటంతో అన్ని చోట్లా ప్రత్యక్ష తరగతులు మొదలవుతున్నాయి. ఈ క్రమంలో మళ్లీ కర్నాటకలో స్కూల్స్, కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మూడు రోజులపాటు తాళాలు వేయాలంటూ యాజమాన్యాలను ఆదేశించింది. ప్రభుత్వ రంగంలోని అన్ని విద్యాసంస్థలు మూసి ఉంచాల్సిందేనని బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హిజాబ్ వివాదం.. రెండు వారాలుగా కర్నాటకలో జరుగుతున్న హిజాబ్ వివాదం […]

Advertisement
Update:2022-02-09 03:45 IST

నిన్న మొన్నటి వరకు కరోనా కారణంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు సెలవలు ఇచ్చారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడటంతో అన్ని చోట్లా ప్రత్యక్ష తరగతులు మొదలవుతున్నాయి. ఈ క్రమంలో మళ్లీ కర్నాటకలో స్కూల్స్, కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మూడు రోజులపాటు తాళాలు వేయాలంటూ యాజమాన్యాలను ఆదేశించింది. ప్రభుత్వ రంగంలోని అన్ని విద్యాసంస్థలు మూసి ఉంచాల్సిందేనని బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

హిజాబ్ వివాదం..
రెండు వారాలుగా కర్నాటకలో జరుగుతున్న హిజాబ్ వివాదం చినికి చినికి గాలివానలా మారి చివరకు విద్యాసంస్థల్లో ఘర్షణలకు దారి తీసింది. ఉడుపి, మాండ్య జిల్లాల్లో విద్యార్థి వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీని ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా కనపడుతుండటంతో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది.

అసలేంటీ వివాదం..
కర్నాటకలోని ఉడుపి జిల్లా కుందాపుర పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో హిజాబ్ ధరించకూడదంటూ విద్యార్థినులకు ఆదేశాలిచ్చారు సిబ్బంది. అయినా కూడా కొంతమంది విద్యార్థినులను హిజాబ్ తో కాలేజీకి రావడంతో వారిని వేరుగా ఉంచి తరగతులు నిర్వహించారు. ఆ తర్వాత హిజాబ్ ధరించడంపై అవగాహన కల్పించడానికి ఫిబ్రవరి 1 న కర్నాటకలోని పలు ప్రాంతాల్లో ప్రపంచ హిజాబ్ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రదర్శనలు నిర్వహించారు. దీని తర్వాత ఈ వివాదం మరింత పెరిగింది. హిజాబ్ కి పోటీగా.. కొంతమంది హిందూ విద్యార్థులు కాషాయ కండువాలతో కాలేజీలకు హాజరయ్యారు. తాజాగా కర్నాటకలో ఓ విద్యార్థిని హిజాబ్ ధరించి కాలేజీకి వస్తుండగా.. కాషాయ కండువాలు ధరించిన విద్యార్థులు ఆమెను అడ్డుకోడానికి రావడంతో వివాదం మరింత ముదిరింది. పరిస్థితి చేయి దాటుతోందన్న సంకేతాలతో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.

కోర్టులో విచారణ..
హిజాబ్ వివాదంపై ఇప్పటికే కర్నాటక హైకోర్టు విచారణ చేపట్టింది. అల్లర్లు మంచిది కాదని విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకోవడం కలచివేసే అంశమని పేర్కొంది కర్నాటక హైకోర్టు. ఈరోజు కూడా విచారణ కొనసాగాల్సి ఉంది. కోర్టు విచారణ నేపథ్యంలో విద్యాసంస్థలకు మూడురోజులపాటు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

Tags:    
Advertisement

Similar News