ఈసారికింతే.. సందడిలేని ఎన్నికల ప్రచారం..

కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో కూడా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు ఓ రేంజ్ లో జరిగాయి. ప్రచార ఆర్భాటాలు, ర్యాలీలు, భారీ బహిరంగ సభలతో హడావిడి బాగా జరిగింది. కానీ థర్డ్ వేవ్ ముప్పు పొంచిఉన్నవేళ జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల విషయంలో మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రెండుసార్లు ఎన్నికల ర్యాలీలపై నిషేధం పొడిగించిన ఎలక్షన్ కమిషన్.. తాజాగా మరోసారి వాటిని […]

Advertisement
Update:2022-02-01 03:29 IST

కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో కూడా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు ఓ రేంజ్ లో జరిగాయి. ప్రచార ఆర్భాటాలు, ర్యాలీలు, భారీ బహిరంగ సభలతో హడావిడి బాగా జరిగింది. కానీ థర్డ్ వేవ్ ముప్పు పొంచిఉన్నవేళ జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల విషయంలో మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రెండుసార్లు ఎన్నికల ర్యాలీలపై నిషేధం పొడిగించిన ఎలక్షన్ కమిషన్.. తాజాగా మరోసారి వాటిని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. రోడ్ షోలు, పాదయాత్రలు, సైకిల్ ర్యాలీలు, ఊరేగింపుల‌పై ఫిబ్రవరి 11 వ‌ర‌కు నిషేధాన్ని పొడిగించింది.

సందడిలేని ఎన్నికలు..
ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఫిబ్రవరి 10నుంచి మార్చి 7 వరకు మొత్తం 7 దశల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాలకు సింగిల్ ఫేజ్ లో ఎన్నికలు పూర్తవుతాయి. మణిపూర్ లో రెండు దశలు, యూపీలో 7 దశల్లో ఎన్నికలు జరుగుతాయి. మార్చి 10న అన్ని రాష్ట్రాల ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఎన్నికల షెడ్యూల్ తోపాటు, ప్రచార నిషేధ ఆంక్షలను ప్రకటించిన ఈసీ.. పగడ్బందీగా వాటిని అమలు చేస్తోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంక్షలను పొడిగించుకుంటూ పోతోంది.

పశ్చిమబెంగాల్, తమిళనాడు ఎన్నికల సమయంలో కరోనా కేసుల వ్యాప్తిపై అప్పట్లో తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఈసారి ఈసీ అలాంటి విమర్శలకు తావివ్వకుండా ముందుగానే ఆంక్షలు విధించింది. దీంతో రాజకీయ పార్టీలన్నీ సోషల్ మీడియా ప్రచారాన్నే బాగా నమ్ముకున్నాయి. బహిరంగ సభలకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వడంలేదు. ఫిబ్రవరి 11 తర్వాత కూడా ఆంక్షలలో పెద్దగా సవరణలు ఉండే అవకాశం కనిపించడంలేదు. ఈమధ్య కాలంలో అత్యంత చప్పగా సాగుతున్న ఎన్నికలు ఇవే అని చెప్పాలి.

Tags:    
Advertisement

Similar News