ఐఏఎస్ క్యాడర్ రూల్స్.. మీ సంగతేంటి చెప్పండి..?

ఐఏఎస్ క్యాడర్ రూల్స్ మార్చేందుకు కేంద్రం సిద్ధమైన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ముసాయిదాను ప్రకటించి రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది కేంద్రం. జనవరి 25 డెడ్ లైన్ పూర్తయినా కూడా ఇంకా కొన్ని రాష్ట్రాలు కనీసం ఈ విషయంపై స్పందించకపోవడం గమనార్హం. ఇప్పటి వరకూ 15 రాష్ట్రాలు మాత్రమే ఐఏఎస్ క్యాడర్ రూల్స్ మార్పుపై తమ స్పందన తెలియజేశాయి. మిశ్రమ స్పందన.. ఐఏఎస్ క్యాడర్ రూల్స్ విషయంలో ఇప్పటి వరకూ 15 రాష్ట్రాలు స్పందించగా కేవలం 7 […]

Advertisement
Update:2022-01-26 03:27 IST

ఐఏఎస్ క్యాడర్ రూల్స్ మార్చేందుకు కేంద్రం సిద్ధమైన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ముసాయిదాను ప్రకటించి రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది కేంద్రం. జనవరి 25 డెడ్ లైన్ పూర్తయినా కూడా ఇంకా కొన్ని రాష్ట్రాలు కనీసం ఈ విషయంపై స్పందించకపోవడం గమనార్హం. ఇప్పటి వరకూ 15 రాష్ట్రాలు మాత్రమే ఐఏఎస్ క్యాడర్ రూల్స్ మార్పుపై తమ స్పందన తెలియజేశాయి.

మిశ్రమ స్పందన..
ఐఏఎస్ క్యాడర్ రూల్స్ విషయంలో ఇప్పటి వరకూ 15 రాష్ట్రాలు స్పందించగా కేవలం 7 రాష్ట్రాలు మాత్రమే కేంద్రం ప్రతిపాదించిన సవరణలకు తాము పూర్తి అనుకూలం అని స్పష్టం చేశాయి. ఐదు రాష్ట్రాలు అసలు ఈ ప్రతిపాదనలే సరికాదంటూ వ్యతిరేకించాయి. తమిళనాడు, తెలంగాణ, కేరళ రాష్ట్రాలనుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైనా.. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేరుగా ప్రధాని నరేంద్రమోదీకి లేఖలు రాశారు. క్యాడర్ రూల్స్ మార్చొద్దని సూచించారు. సవరణలు చేస్తే కలిగే నష్టాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో ఇంకా స్పందించకపోవడం గమనార్హం. కేంద్రం తీసుకు రావాలనుకుంటున్న కొత్త నిబంధనలకు ఏపీ సానుకూలమా, లేక వ్యతిరేకమా అనే విషయంలో అధికారిక ప్రకటన విడుదల కాలేదు.

చుట్టపు చూపుగా వచ్చిపోతారా..?
ఐఏఎస్ అధికారులను రాష్ట్రాలకు కేటాయించిన తర్వాత వారిని కేంద్ర సర్వీసులకు బదిలీ చేసే విషయంలో ఇప్పటి వరకూ రాష్ట్రాలదే తుది నిర్ణయం. కేంద్ర సర్వీసులకు వెళ్లాలనుకునేవారికి కేంద్ర పెద్దల ఆశీర్వాదంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వంలో బలమైన లాబీయింగ్ ఉండాలి. అలా అయితేనే వారికి ఆ అవకాశం ఉంటుంది, లేకపోతే రాష్ట్రాల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఇకపై రాష్ట్రాలకు ఆ అధికారం లేకుండా, కేంద్రానిదే తుది నిర్ణయం అనేలా క్యాడర్ రూల్స్ మార్చబోతున్నారు. ఐఏఎస్ లను తాము కోరినప్పుడు వెంటనే కేంద్రానికి అప్పగించేలా, రాష్ట్రాలకు తుది నిర్ణయాధికారం లేకుండా క్యాడర్ రూల్స్ ని సవరిస్తున్నారు. కానీ ఇది రాష్ట్రాలకు ఇష్టం లేదు. సమర్థంగా పనిచేసే అధికారులను కేంద్రం తీసుకెళ్తే.. రాష్ట్రాలు ఏం చేయాలని ప్రశ్నిస్తున్నారు ముఖ్యమంత్రులు. సవరణలు సరికాదంటున్నారు. ప్రస్తుతానికి దీనిపై ఏకాభిప్రాయం సాధ్యమయ్యేలా కనిపించడంలేదు.

Tags:    
Advertisement

Similar News