లాంఛింగ్.. ఫస్ట్ లుక్ ఒకేసారి

సాధారణంగా సినిమా ప్రారంభమైనప్పుడు, రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి కొన్ని రోజులు గడిచిన తర్వాత ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తుంటారు. కానీ ఈమధ్య కొంతమంది హీరోలు తమ సినిమా ప్రారంభోత్సవం రోజునే ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసి సినిమాపై హైప్ పెంచుతున్నారు. తాజాగా రవితేజ ఇదే పని చేశాడు. తన సినిమా లాంఛింగ్ రోజునే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించాడు. రవితేజ హీరోగా అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ […]

Advertisement
Update:2022-01-15 14:54 IST

సాధారణంగా సినిమా ప్రారంభమైనప్పుడు, రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి కొన్ని రోజులు గడిచిన తర్వాత ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తుంటారు. కానీ ఈమధ్య కొంతమంది హీరోలు తమ సినిమా ప్రారంభోత్సవం రోజునే ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసి సినిమాపై హైప్ పెంచుతున్నారు. తాజాగా రవితేజ ఇదే పని చేశాడు. తన సినిమా లాంఛింగ్ రోజునే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించాడు.

రవితేజ హీరోగా అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “రావణాసుర”. ఈ చిత్రం జనవరి 14న బోగి సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షం లో అన్నపూర్ణ స్టూడియోలో అత్యంత వైభవంగా ప్రారంభమయింది. దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు స్క్రిప్ట్ అందించారు. రవితేజపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి క్లాప్ కొట్టారు.

ఈ సందర్భంగా రావణాసుర పోస్టర్ ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. ఈ పోస్టర్ లో రవితేజ వైట్ షర్ట్ కోటు వేసుకొని సిగరెట్ వెలిగిస్తుండగా షర్ట్ పై బ్లడ్, ఫైర్ కనిపిస్తుంది.. ఫస్ట్ లుక్ చూస్తే సినిమా యాక్షన్ మూవీ అనే విషయం అర్థమౌతోంది.

శ్రీకాంత్ విస్సా కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్న ఈ చిత్రంలో యంగ్ హీరో సుశాంత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అతడికి సంబంధించిన లుక్ ను కూడా రివీల్ చేశారు. అను ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్ , ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందు. సెప్టెంబర్ 30న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని లాంఛింగ్ రోజునే ప్రకటించారు మేకర్స్.

Tags:    
Advertisement

Similar News