మహిళా పోలీస్ లకు పదోన్నతులు.. ఇకపై ఎస్పీ పర్యవేక్షణలో విధులు..

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా, శిశు సంరక్షణ కార్యదర్శుల పోస్టింగ్ విషయంలో ఎట్టకేలకు ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. గతంలో వీరిని పోలీస్ విభాగంలోకి తీసుకునేలా, యూనిఫామ్ ఇచ్చేలా ప్రభుత్వం జారీ చేసిన జీవోని కోర్టు తోసిపుచ్చింది. దీంతో సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీస్ ల కోసం కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం. వారికి ప్రమోషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై వారిని ఏపీ పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఓ ప్రత్యేక […]

Advertisement
Update:2022-01-13 05:17 IST

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా, శిశు సంరక్షణ కార్యదర్శుల పోస్టింగ్ విషయంలో ఎట్టకేలకు ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. గతంలో వీరిని పోలీస్ విభాగంలోకి తీసుకునేలా, యూనిఫామ్ ఇచ్చేలా ప్రభుత్వం జారీ చేసిన జీవోని కోర్టు తోసిపుచ్చింది. దీంతో సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీస్ ల కోసం కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం. వారికి ప్రమోషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై వారిని ఏపీ పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఓ ప్రత్యేక విభాగంగా గుర్తిస్తారు. జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో వారు విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

4నెలలు శిక్షణ..
ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న మహిళా పోలీస్ లకు నాలుగు నెలల శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 3 నెలలు పోలీస్‌ కాలేజీలో, నెల రోజులపాటు క్షేత్ర స్థాయి శిక్షణ ఇస్తారు. మహిళా పోలీసుల నియామకం, శిక్షణ సిలబస్‌, జాబ్‌ చార్ట్, సబార్డినేట్‌ సర్వీస్‌ నిబంధనలను కూడా ఖరారు చేశారు.

ఇకపై నియామకాల్లో మార్పులు..
ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసుల నియామకం కేవలం రాత పరీక్ష ఆధారంగానే జరిగింది. వారికి ఫిజికల్ టెస్ట్ లు లేవు, ఇకపై నియామక ప్రక్రియలో మార్పులు ఉంటాయి. ప్రస్తుతం మహిళా సంరక్షణ కార్యదర్శులుగా ఉన్నవారిని మహిళా పోలీసులుగా రీ డిజిగ్నేట్ చేస్తారు. ఇకపై జరిగే నియామకాల్లో 90 శాతం మందిని నేరుగా ఎంపిక చేస్తారు. మిగిలిన 10 శాతంలో 5 శాతం అర్హులైన హోమ్‌ గార్డులకు, మిగిలిన 5 శాతం గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్లకు అవకాశం ఇస్తారు. అభ్యర్థులు 5 అడుగులు ఎత్తు, 40 కిలోల బరువు తగ్గకూడదు. గిరిజన అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది. 20నిముషాల్లో 2కిలోమీటర్లు నడవాలి. రాత పరీక్షతోపాటు, మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది, రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. మొత్తమ్మీద.. సచివాలయ మహిళా పోలీస్ ల విషయంలో కోర్టు అభ్యంతరాల అనంతరం వారి నియామకం, విధులపై ప్రభుత్వం పూర్తి క్లారిటీ ఇస్తూ కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది.

Tags:    
Advertisement

Similar News